హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా నెగిటివ్.. కానీ..

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా నెగిటివ్.. కానీ..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubrahmanyam: లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి గత నెల రోజులుగా చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన కోసం..

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి గత నెల రోజులుగా చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అంతా పూజలు, వ్రతాలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. వాళ్లందరి ప్రార్థనలు ఫలించి బాలు ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని ఆయన తనయుడు చరణ్ కూడా చెప్పాడు. ఇప్పుడు మరోసారి హెల్త్ బులెటన్ గురించి చెప్పాడు చరణ్. బాలసుబ్రమణ్యం కోసం విదేశీ వైద్య బృందం పని చేస్తున్నారు.

ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ లేెటస్ట్ అప్‌డేట్ (instagram/photo)
ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ లేెటస్ట్ అప్‌డేట్ (instagram/photo)

కొన్ని రోజుల కింద అత్యంత విషమ స్థితిలో ఉన్నాడు బాలసుబ్రమణ్యం. ఎక్మో కూడా ఈయన కోసం వాడారు. కొన్ని రోజుల వరకు కూడా కృతిమ శ్వాసమీదే ఉన్నాడు బాలు. అయితే కొన్ని రోజులుగా కోలుకుంటూ వచ్చాడు బాలసుబ్రమణ్యం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపాడు తనయుడు చరణ్. పైగా ఇప్పుడు చేసిన పరీక్షలో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపాడు ఎస్పీ చరణ్.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)

అయితే ఇక్కడ విషయం కరోనా పాజిటివ్ నెగిటివ్ కాదని.. ఆయన లంగ్స్ ఇప్పటికే చాలా వరకు కూడా దెబ్బ తిన్నాయని చెప్పాడు. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అది త్వరగా తగ్గిపోతే ఆయన ఆరోగ్యం మరింత బాగుపడుతుందని చెప్పాడు చరణ్. ఈ వారంలోనే వెంటిలేటర్ కూడా తీస్తారని ఆశించినా అది కుదర్లేదని.. మరికొన్ని రోజుల వరకు ఆయన వెంటిలేటర్‌పైనే ఉంటాడని చెప్పాడు చరణ్. హాస్పిటల్లోనే అమ్మానాన్న వివాహ వార్షికోత్సవం కూడా జరిపామని చెప్పాడు చరణ్. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఆయనకు ఇష్టమైన క్రికెట్, టెన్నిస్ చూస్తున్నాడని.. ఐపిఎల్ కోసం వేచి చూస్తున్నాడని తెలిపాడు చరణ్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు