హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: తన విగ్రహాన్ని తానే రెడీ చేయించుకున్న ఎస్పీ బాలు..

SP Balasubrahmanyam: తన విగ్రహాన్ని తానే రెడీ చేయించుకున్న ఎస్పీ బాలు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలు విగ్రహం (Twitter/Photo)

గాన గంధర్వుడు ఎస్పీ బాలు విగ్రహం (Twitter/Photo)

SP Balasubrahmanyam Statue | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ, క్రీడా అనే తేడా లేకుండా అబాల గోపాలం అందరు ఆయనకు నివాళులు అర్పించారు.

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ, క్రీడా అనే తేడా లేకుండా అబాల గోపాలం అందరు ఆయనకు నివాళులు అర్పించారు. అంతటి మహాగాయకుడికి ప్రభుత్వం భారతరత్నతో గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన ఎపుడో అపుడు కన్నుమూస్తానని అనుకున్నాడో ఏమో.. ఎంతో ముచ్చటపడి తన విగ్రహాన్ని రెడీ చేయించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెంది వడయార్ రాజ్ కుమార్ అనే శిల్పి బాలు విగ్రహాన్ని తీర్చిదిద్దారు.  ముందుగా బాలు గారు తమ తల్లిదండ్రుల విగ్రహాలను తయార చేయమని ఆ శిల్పిని సంప్రదించారట. అలా వాళ్ల తల్లి తండ్రికి సంబంధించిన విగ్రహాలను ఆ శిల్పి బాలుగారికి చేసి ఇచ్చారు. వాటిని చూసి ముచ్చటపడ్డ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని తయారు చేయమని కోరారట. ఈ విగ్రహాన్ని తన రికార్డింగ్ థియేటర్‌లో ఉంచుకోవాలని అనుకున్నారట. ఇక రాజ్ కుమార్ చెక్కిన తన శిల్పం చేసి బాలు బాగుందున్నారు. ఈ విగ్రహంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయెద్దని విగ్రహ శిల్పి రాజ్‌కుమార్‌కు వాయిస్ మెసేజ్ చేసారట. ఎంతో ముచ్చట పడి తయారు చేసుకున్న విగ్రహాన్ని కళ్లారా చూడకుండానే బాలు కన్నుమూసారు. ఈ విషయమై రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన వద్ద బాలుతో పాటు ఆయన తల్లి విగ్రహం తన వద్దనే ఉన్నాయని తెలిపారు.

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శిల్పం (Twitter/Photo)

  ఎస్పీ బాలు విషయానికొస్తే..  50 ఏళ్లు భారతీయ సినీ సంగీతాన్ని తన గళంతో శాసించారు.  ఆయన గురించి ఎంత చెప్పినా.. సముద్రంలో నీటి చుక్కంత.  కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు బాలు. ఈయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి బాలు తన రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసారు. సినీ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేసినా.. ఎస్పీ బాలుకు దర్శకత్వం వహించాలనేది ఓ కోరిక. పలు సందర్భాల్లో ఆయన మిత్రులు కూడా బాలు గారిని ఏదైని సినిమాకు డైరెక్ట్ చేయమని కోరారట. ఆయన కూడా ఓ కథను కూడా రెడీ చేసుకున్నట్టు సమాచారం. కానీ ఆ కోరిక తీరకుండానే కరోనా మహామ్మారి ఆయన్ని బలిగొంది. కరోనా భారతీయులకు చేసినా నష్టం ఏదైనా ఉందంటే.. అది  భారతీయ సినీ సంగీత ప్రేమికులు ఎంతగానో అభిమానించే ఎస్పీ బాలును మననుండి దూరం చేసింది

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు