Home /News /movies /

SP BALASUBRAHMANYAM SPECIAL RELATION WITH BOLLYWOOD INDUSTRY TA

SP Balasubrahmanyam: హిందీ చిత్రసీమను ఏలిన బాలు.. బాలీవుడ్‌తో ప్రత్యేక అనుబంధం..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)

SP Balasubrahmanyam Passes Away | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో అందరు హీరోలకు వాళ్లకు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు పాటలు పాడి అనితర సాధ్యుడు అనిపించుకున్న బాలసుబ్రహ్మణ్యం.. బాలీవుడ్‌‌ను సైతం  ఏలారు.

  SP Balasubrahmanyam Passes Away |  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో అందరు హీరోలకు వాళ్లకు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు పాటలు పాడి అనితర సాధ్యుడు అనిపించుకున్న బాలసుబ్రహ్మణ్యం.. బాలీవుడ్‌‌ను సైతం  ఏలారు. అంతేకాదు హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన సత్తా చాటారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రవేశం విచిత్రంగా జరిగింది.  తొలిసారి బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఏక్ దూజే కే లియే’ సినిమాతో బాలీవుడ్‌లో తనదైన గాన మాధుర్యాన్ని అందించారు. ఈ చిత్రం తెలుగులో హిట్టైన ‘మరో చరిత్ర’ సినిమాకు రీమేక్. ఈ సినిమాలో తేరే మేరే బీచ్ మే అనే పాటకు బాలుగారు రెండోసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఒక ప్రాంతీయ భాషకు చెందిన గాయకుడు.. హిందీలో అవార్డు అందుకోవడం అనేది ఒక రికార్డు. ఆ రికార్డును బాలు సుసాధ్యం చేసారు.

  ఏక్ దూజే కే లియే సినిమాకు హిందీలో నేషనల్ అవార్డు (File/Photo)


  ఆ తర్వాత ఈయన హిందీలో పలు కమల్ హాసన్, రజినీకాంత్ నటించిన పలు హిందీ చిత్రాలకు పాటలు పాడారు. ‘ఏక్ దూజే కే లియే’ సినిమా తర్వాత జరా సీ జిందగీ’, ‘ఏక్ నయి పహేలి’, ’సాగర్’, చిత్రాలకు ఈయన పాడిన పాటలు అప్పట్లో పెద్ద సెన్సేషన్.
  ఇక 1989లో సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ ఆర్. బార్హాత్యా తెరకెక్కించిన ‘మైనే ప్యార్ కియా’ సినిమాకు రామ్ లక్ష్మణ్ సంగీతానికి ఎస్పీ బాలు గానం తోడై.. .ఈ చిత్రం సక్సెస్‌లో కీలక పాత్రను పోషించాయి. అప్పట్లో ఈ సినిమా పాటలు హిందీ చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసాయి.  ముఖ్యంగా ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ప్రేమ పావురాలు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా ఆ పాటలు సూపర్ హిట్‌గా నిలవడం విశేషం. హీరోగా సల్మాన్ ఖాన్‌కు ఇదే ఫస్ట్ మూవీ. అంతకు ముందు సల్మాన్ ఓ సినిమాలో నటించిన హీరోగా మాత్రం నటించలేదు. ఇక సల్మాన్ హీరోగా నిలదొక్కుకోవడంలో బాలు గాత్రం దోహదం చేసిందనే చెప్పాలి.

  సల్మాన్ ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో బాలు పాటలు (Twitter/Photo)


  ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ‘సాజన్’ ‘అందాజ్ అప్నా అప్నా’ వంటి సినిమాల్లో బాలు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి.  ముఖ్యంగా ‘మైనే ప్యార్ కియా’ తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ చిత్రంలో బాలు పాడిన పాటలతో అంత పెద్ద సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత దక్షిణాదిలో హిట్టైన పలు సూపర్ హిట్ చిత్రాలను హిందీలో డబ్ చేస్తే అందులోను తన గానామృతంతో వాటిని సక్సెస్ చేసిన ఘనత ఎస్పీ బాలుదే. ఈయన చివరగా హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో పాడారు. మొత్తంగా బాలీవుడ్‌లో సైతం తనదైన ప్రత్యేక ముద్ర వేసారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, S. P. Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు