హోమ్ /వార్తలు /సినిమా /

SP Balu Health: ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా అప్‌డేట్.. గుర్తు పడుతున్నారు..

SP Balu Health: ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా అప్‌డేట్.. గుర్తు పడుతున్నారు..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)

SP Balasubrahmanyam: నిన్నా మొన్నటితో పోల్చితే ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. డాక్టర్లను గుర్తు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఆయన కరోనాను జయిస్తారని అన్నారు ఎస్పీ చరణ్.

  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఐతే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పరిస్థితి విషమించిందన్న వార్తలతో సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి వీడియో సందేశం పంపించారు. నిన్నా మొన్నటితో పోల్చితే ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. డాక్టర్లను గుర్తు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఆయన కరోనాను జయిస్తారని అన్నారు ఎస్పీ చరణ్.

  నాన్నను ఐసీయూ నుంచి ఎక్స్‌క్లూజివ్ ఐసీయూకు తరలించారు. డాక్టర్ల చికిత్సకు స్పందిస్తున్నారు. లైఫ్ సపోర్ట్‌తో ఉన్నప్పటికీ వైద్యులను గుర్తుపడుతున్నారు. థమ్సప్ చూపిస్తున్నారు. నిన్నా మొన్నటితో పోల్చితే ఇవాళ కంఫర్ట్‌గానే శ్వాస తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. త్వరలోనే మాట్లాడతారని ఆశిస్తున్నాం. ఇది ఒకటి రెండు రోజుల్లో కోలుకునేది కాదు. నాన్న కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా కరోనాను జయిస్తారు. మీ ప్రార్థనలను కొనసాగించండి. అమ్మ కోలుకుంటోంది. మంగళవారం లేదా బుధవారం డిశ్చార్జి చేస్తారు.
  ఎస్పీ చరణ్


  రెండు వారాల క్రితం ఎస్సీ బాలసుబ్రమణ్యం కరోనా బారినపడ్డారు. కరోనా సోకిందని.. తనకు ఏమీ కాదని వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. కానీ అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించిందని వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొది. ఐతే రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, SP Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు