హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam | నాన్నకు ఏం కాదు.. ఆయన త్వరగా కోలుకొని వస్తారు.. ఎస్పీ చరణ్..

SP Balasubrahmanyam | నాన్నకు ఏం కాదు.. ఆయన త్వరగా కోలుకొని వస్తారు.. ఎస్పీ చరణ్..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubrahmanyam Health Update:  గాన గంధర్వుుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందంటూ వైద్యులు తెలపడంతో సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ ఎస్పీ బాలు అంటూ హ్యాష్‌ట్యాగ్ మొదలైంది. తాజాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ చరణ్ స్పందించారు.

ఇంకా చదవండి ...

  SP Balasubrahmanyam Health Update:  గాన గంధర్వుుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందంటూ వైద్యులు తెలపడంతో సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ ఎస్పీ బాలు అంటూ హ్యాష్‌ట్యాగ్ మొదలైంది. మీరు త్వరగా కోలుకోవాలి ఇంటికి తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి, ఇళయరాజా, ఏ.ఆర్.రహామాన్‌, ధనుశ్‌,వరుణ్ తేజ్‌తో పాటు దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో సంగీత దర్శకులు, గాయకులు బాల సుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసారు.కరోనా బారిన పడి చెన్నై ఆస్పత్రిలో కోలుకుంటున్న బాలూ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఎస్పీబీ ఆరోగ్యంపై ఓ తమిళ ఛానెల్‌లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. నాన్న ఆరోగ్యం విషమించినప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు.

  ఆయన క్షేమంగానే ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధిస్తున్న వారందరికీ ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలియజేసారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పై ఆయన చెల్లెలు ఎస్పీ వసంత మాట్లాడుతూ.. ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఇపుడు చరణ్‌తో అన్న ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్టు తెలిపారు. భగవంతుడు ఆశీస్సులతో ఆయన తిరిగి ఇంటికి వస్తారని చెప్పారు.

  ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
  ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

  ప్రస్తుతం ఈయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 5న ఈయనకు కరోనా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్పటి వరకు నిలకడగానే ఉన్న ఆరోగ్యం ఆగస్ట్ 13 రాత్రి ఒక్కసారిగా విషమించింది. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ పెద్దలు కూడా కంగారు పడుతున్నారు. బాలు వీలైనంత త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, SP Balasubrahmanyam, SP Charan Singer, Tollywood

  ఉత్తమ కథలు