SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘పాడుతా తీయగా’ కొత్త ప్రోమో వైరల్..

SP Balasubrahmanyam: సంగీత స్వర చక్రవర్తి, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన మధ్య నుంచి భౌతికంగా వెళ్లిపోయి కొన్ని రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2020, 7:00 PM IST
SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘పాడుతా తీయగా’ కొత్త ప్రోమో వైరల్..
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)
  • Share this:
సంగీత స్వర చక్రవర్తి, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన మధ్య నుంచి భౌతికంగా వెళ్లిపోయి కొన్ని రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఎస్పీ బాలు లేని పాటను ఊహించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎస్పీ బాలు అంటే గాయకుడిగానే కాదు పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలు కూడా గుర్తుకొస్తాయి. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో మరే కార్యక్రమానికి సాధ్యం కాని రీతిలో.. నభూతో నభవిష్యతీ అనేలా 20 ఏళ్ల పాటు పాడుతా తీయగా నిర్విరామంగా సాగింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని ఇప్పుడు రెండేళ్లుగా చేస్తున్నారు. తాజాగా ఆయన చనిపోయినా కూడా ఆ కార్యక్రమం మాత్రం నడుస్తూనే ఉంది. ఆయన బతికున్నపుడే ఈ తాజా సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ షూట్ చేసారు దర్శక నిర్మాతలు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)


వాటికి సంబంధించిన ప్రోమోలు ఇప్పుడు విడుదలవుతున్నాయి. అవి చూసిన తర్వాత అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. పాడుతా తీయగా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఎస్పీ బాలునే. ఆ కార్యక్రమంతో వందలాది మంది గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈయన సొంతం. వాళ్లందర్నీ ప్రోత్సహించి ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసాడు ఎస్పీబీ. ఇప్పుడు ఈయన మరణించడంతో పాడుతా తీయగా భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు. బాలు లేని కార్యక్రమం తాము చూడలేమంటున్నారు అభిమానులు.

ఆయన కాకుండా ఎవరు ఈ కార్యక్రమం చేసినా కూడా సరైంది కాదు అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు పాడుతా తీయగా తాజా ఎపిసోడ్స్ కచ్చితంగా రికార్డు రేటింగ్స్ సాధిస్తాయని నమ్ముతున్నారు నిర్వాహకులు కూడా. ఏదేమైనా కూడా ఎస్పీ బాలు ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు.. కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం మనవెంటే ఎప్పటికీ ఉంటాయి.
Published by: Praveen Kumar Vadla
First published: September 30, 2020, 7:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading