హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam : శోఖసంద్రంలో టాలీవుడ్.. ప్రముఖుల సంతాపం..

SP Balasubrahmanyam : శోఖసంద్రంలో టాలీవుడ్.. ప్రముఖుల సంతాపం..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించి 3 వారాలు పూర్తైనా కూడా ఇప్పటికీ ఆయన ధ్యాసలోనే ఉన్నారు అభిమానులు. బాలు లేడన్న వార్తను కొందరు నమ్మలేకపోతున్నారు కూడా. బాలు లేకపోయినా ఆయన స్వరం మాత్రం ఎక్కడో ఓ చోట రోజూ వినిపిస్తూనే ఉంది.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించి 3 వారాలు పూర్తైనా కూడా ఇప్పటికీ ఆయన ధ్యాసలోనే ఉన్నారు అభిమానులు. బాలు లేడన్న వార్తను కొందరు నమ్మలేకపోతున్నారు కూడా. బాలు లేకపోయినా ఆయన స్వరం మాత్రం ఎక్కడో ఓ చోట రోజూ వినిపిస్తూనే ఉంది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం‌కు కరోనా సోకడంతో గత నెల 5వ తేదిన చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కరోనా పోరాడుతూ కాసేపటి క్రితమే మధ్యాహ్నం 01గం.04 నిమిషాలకు తుది శ్వాస విడిశారు.

  ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం‌కు కరోనా సోకడంతో గత నెల 5వ తేదిన చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కరోనా పోరాడుతూ కాసేపటి క్రితమే మధ్యాహ్నం 01గం.04 నిమిషాలకు తుది శ్వాస విడిశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత 52 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. మధ్యలో ఆయన కోలుకున్నట్టు వార్తలు వచ్చినా.. ప్రాణాలు నిలవలేదు. బాలు సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చిత్రసీమకు ఎనలేని సేవలందించారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వేలాది పాటలకు తన స్వరంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు. అటువంటి గొప్ప గాయకుడిని కరోనా రూపంలో మృత్యువు కబలించడం బాధాకరం. ఆయన మ‌ర‌ణం యావ‌త్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్తతో సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు