news18-telugu
Updated: November 28, 2020, 8:56 AM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)
SP Balasubrahmanyam: లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన నుంచి దూరం అయి రెండు నెలలు అయితున్నాయి. అయినా..ఆయన జ్ఞాపకాలు శ్రోతలను అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగానే కాదు.. సంగీత దర్శకుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. నిర్మాతగా.. అన్నింటికి మించి ఆయనలో మంచి నటుడు ఉన్నారు. ఆయన ముఖ్యపాత్రలో తనికెళ్ల భరణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిథునం’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో లక్ష్మితో కలిసి ఆయన పండించిన నటనను ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేదు. ఇపుడు సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఎస్పీ బాలు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను థీమ్ యూనివర్సల్ కాబట్టి.. ఏ భాషలో తీసినా.. నేటివిటీ సమస్య ఉండదు. హిందీలో ఈ సినిమాను అమితాబ్ బచ్చన్.. తన నిజ జీవిత భాగస్వామి జయ బచ్చన్‌తో ఈ సినిమాలో కలిసి నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు బిగ్‌బీతో రేఖ నటించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి అమితాబ్.. ఎవరితో ‘మిథునం’ సినిమాను రీమేక్ చేస్తాడనేది చూడాలి.
ఇప్పటికే ఎస్పీ బాలు నటించిన ‘మిథునం’ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఎప్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ (Twitter/Photo)
2012లో విడుదలైన ఈ సినిమా పెద్ద విజయమే సాధించింది. ఈ చిత్రంలో ఎస్పీ బాలు నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. ఇక హిందీ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు. ఎవరు నిర్మిస్తారనేది త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 28, 2020, 8:56 AM IST