SP Balasubrahmanyam : ఇవాళ చెన్నై ఫామ్ హౌజ్‌లో ఎస్పీ బాలు అంత్యక్రియలు..

SP Balasubrahmanyam : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

news18-telugu
Updated: September 26, 2020, 7:22 AM IST
SP Balasubrahmanyam : ఇవాళ చెన్నై ఫామ్ హౌజ్‌లో ఎస్పీ బాలు అంత్యక్రియలు..
ఎస్పీ బాలసుబ్రమణ్యం (File/Photo)
  • Share this:
యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచుతూ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  కరోనాతో గత 44 రోజులుగా చెన్నై ఎంజియం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్ బాలు సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మరణించాడు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  ఎంజియం ఆసుపత్రి నుంచి బాలు మృతదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి అభిమానుల సందర్శనార్థం తరలించారు. దీంతో ఆయన చివరి చూపు కోసం వేలాది మంది అక్కడకు తరలి వచ్చారు. కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.  బాలు మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. కోట్లాది సంగీత హృదయాలు ఆయన లేడనే వార్త తెలిసి మౌనంగా రోదిస్తున్నాయి. ఇక నువ్వు రావా.. నీ పాట మేం వినలేమా అంటూ కన్నీరు కారుస్తున్నారు. . బాలు మరణవార్త తెలిసిన వెంటనే యావత్ భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతిపై సంతాపం సంతాపం ప్రకటించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు (SP Balasubrahmanyam last rites)
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు (SP Balasubrahmanyam last rites)


అయితే, అభిమానుల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో... ఇంటి నుంచి ఆయన పార్థివదేహాన్ని తామరైపాక్కంలో ఉన్న ఫాంహౌస్ కు తరలించారు. ఈరోజు ఉదయం 11 గంటలకుప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఫామ్ హౌజ్‌కు తరలించారు. అక్కడే అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. సెప్టెంబర్ 26న ఉదయాన్నే బాలు అంతిమయాత్ర మొదలు కానుంది.
Published by: Suresh Rachamalla
First published: September 26, 2020, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading