హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam Last rites: చెన్నైలోని ఫాం హౌజ్‌లో ఎస్పీ బాలు అంత్యక్రియలు..

SP Balasubrahmanyam Last rites: చెన్నైలోని ఫాం హౌజ్‌లో ఎస్పీ బాలు అంత్యక్రియలు..

నెల రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో బాలు పాటలను స్మరించుకుంటున్నారు. మీరు లేని పాటల ప్రపంచం పూర్తిగా పెద్దదిక్కు లేకుండా పోయిందంటూ మౌనంగా రోదిస్తున్నారు. దానికితోడు దసరా కోసం చేసిన ఈవెంట్స్ అన్నింట్లోనూ ఎస్పీబీని గుర్తు చేసుకుంటూ ఏడ్చేసారు సంగీత దర్శకులు, గాయకులు. ఇలా ఎన్ని నెలలైనా.. ఎన్నేళ్లైనా కూడా బాలు పాట అమరం అంటూ ఆయనకు అంత ఘన నివాళి అందిస్తున్నారు.

SP Balasubrahmanyam Last Rites: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. ఈయన మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. కోట్లాది సంగీత హృదయాలు ఆయన లేడనే వార్త తెలిసి మౌనంగా రోదిస్తున్నాయి.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. ఈయన మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. కోట్లాది సంగీత హృదయాలు ఆయన లేడనే వార్త తెలిసి మౌనంగా రోదిస్తున్నాయి. ఇక నువ్వు రావా.. నీ పాట మేం వినలేమా అంటూ కన్నీరు కారుస్తున్నారు. గత 44 రోజులుగా చెన్నై ఎంజిఎంలో చికిత్స పొందుతున్న ఈ లెజెండరీ గాయకుడు సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మరణించాడు. బాలు మరణవార్త తెలిసిన వెంటనే యావత్ భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు (SP Balasubrahmanyam last rites)
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు (SP Balasubrahmanyam last rites)

బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 26 ఉదయం 11 గంటలకు ఈయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నైలోని రెడ్ హిల్స్‌లోని తన సొంత ఫామ్ హౌజ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఫామ్ హౌజ్‌కు తరలిస్తున్నారు. అక్కడే అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు. సెప్టెంబర్ 26 ఉదయాన్నే ఈయన అంతిమయాత్ర మొదలు కానుంది. కాడంబాకంలోని సొంత నివాసంలోనే రాత్రంతా ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు