హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: మరణం తర్వాత తన సమాధిపై ఏం రాయాలో 20 ఏళ్ల కిందే చెప్పిన ఎస్పీ బాలు..

SP Balasubrahmanyam: మరణం తర్వాత తన సమాధిపై ఏం రాయాలో 20 ఏళ్ల కిందే చెప్పిన ఎస్పీ బాలు..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)

SP Balasubrahmanyam: సంగీత ప్రపంచం అంతా ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది. భారతీయ సినీ పరిశ్రమ కూడా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతుంది. అందుకే ఆయనతో ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు..

సంగీత ప్రపంచం అంతా ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది. భారతీయ సినీ పరిశ్రమ కూడా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతుంది. అందుకే ఆయనతో ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.. సన్నిహితులు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరూ తమకు బాలుతో ఉన్న అనుబంధం గురించి చెప్తున్నారు. అయితే ఈయన ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఎప్పుడూ ఒదిగే ఉన్నారు. ఆయన స్థాయి ఇది అని ఎప్పుడూ హెచ్చులకు పోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే 74 ఏళ్ల చిన్నపిల్లాడు ఆయన.

ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు (SP Balasubrahmanyam last rites)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)

అలాంటి మనస్తత్వమే ఆయనకు ఉండేది కూడా. సేవాగుణంలో కూడా ఈయనను మించిన వాళ్లు లేరేమో..? ఎన్నో గుప్తదానాలు కూడా చేసాడు బాలు. అంతెందుకు తన సొంతింటిని కూడా దానం చేసాడు బాలు. నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో పూర్వీకుల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఒక ఇల్లు ఆస్తిగా వచ్చింది. ఈ ఇంటిని ఆయన కంచి పీఠానికి విరాళంగా ఇచ్చారు. వేద పాఠశాలను నిర్వహించడానికి గానూ ఆయన తన సొంతింటిని పీఠానికి దానం ఇచ్చేసారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)

కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిని స్వయంగా కలిసి తన ఇంటిని పీఠానికి సమర్పించారు బాలు. ఆ ఇంటిలో శైవభక్తులైన తన తండ్రికి గుర్తుగా వేద పాఠశాల నిర్వహించాలని కోరారు. ఒకానొక సమయంలో తన ఇంటిని కంచి పీఠానికి తన గృహాన్ని దానం చేయలేదని.. అది తను భగవంతుడికి చేస్తున్న సేవ అని చెప్పాడు. ఇదిలా ఉంటే మరణించిన తర్వాత తన సమాధిపై ఏం రాయాలో కూడా ముందుగానే చెప్పాడు బాలు. ఏదో ఓ రోజు మరణం అనేది తప్పకుండా వస్తుందని.. తాను చావుకు ఎప్పుడూ భయపడలేదని ఎన్నోసార్లు చెప్పాడు బాలసుబ్రమణ్యం.

ఎస్పీ బాలు మంగళంపల్లి (sp balu mangalampalli)
ఎస్పీ బాలు మంగళంపల్లి (sp balu mangalampalli)

ఇప్పుడు ఆ విషాదకరమైన రోజు రానే వచ్చింది. ఇదిలా ఉంటే 1999లో ఓ పాటల పోటీకి ముఖ్య అతిథిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ వచ్చారు. ఆయనంటే ఎస్పీ బాలుకు ఎంతో గురు భక్తి. తన కార్యక్రమానికి మంగళంపల్లి రావడం బాలు చాలా సంతోషించారు. ఈ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. బాలు గురించి చాలా మంచి వ్యాఖ్యలు చేసారు. కష్టపడితే తనలా పాడగలడని.. కానీ తాను ఎంత సాధన చేసినా కూడా బాలులా పాడలేనని చెప్పాడు. ఆ మాటలు విన్న బాలు ఆకాశంలో తేలిపోయాడు.

ఎస్పీ బాలు మంగళంపల్లి (sp balu mangalampalli)
ఎస్పీ బాలు మంగళంపల్లి (sp balu mangalampalli)

ఇంతకంటే తన జీవితానికి ఇంకేం కావాలని.. గురుతుల్యులు అయిన మంగళంపల్లి లాంటి వాళ్లే తన గురించి ఇలాంటి మాటలు చెప్పడం నిజంగా అదృష్టం అని చెప్పాడు బాలు. తన జీవితంలో ఇంతకంటే గొప్ప ప్రశంసలు ఏం లేవని చెప్పాడు బాలసుబ్రమణ్యం. తను చనిపోయిన తర్వాత సమాధిపై ఏమైనా రాయాలా అంటే మంగళంపల్లి బాలమరళీకృష్ణ లాంటి మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గురించి ఇలా అన్నారు అని రాయాలని కోరారు. ఈ మాటలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుని బాధ పడుతున్నారు అభిమానులు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు