బాలు ఆరోగ్యం కుదటపడాలని సిరివెన్నెల భావోద్వేగ గీతం (Twitter/Photo)
SP Balasubrahmanyam Sirivennela | ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా బాలూ ఆరోగ్యం కుదటపడాలని ప్రముఖ గేయ రచయత పద్మశ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry) ఓ కవితను వినిపించారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ఏమైందో అంటూ అభిమానులు కూడా దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు.. బాలీవుడ్ నుంచి శాండిల్ వుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రముఖులతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని కార్యాలయం కూడా బాలు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిన్నటిలాగే ఉందని .. ఆయనకు వెంటిలేటర్ పై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వీడియో సందేశం ఇచ్చారు. తాజాగా ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం తెలుగు సినిమా సాహిత్య లోకం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్ధించారు. అందులో ప్రముఖ సినీ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry) తనదైన కవితాత్మక శైలిలో బాలూ అన్నయ్య కోలుకోవాలని వీడియో సందేశం ఇచ్చారు.
సిరివెన్నెల కవితలో.. ఒక ప్రాణం కాస్త నలతగా ఉండి ఆయాసపడుతుంటే.. ఒకటి కాదు.. వేలు, లక్షలు కాదు.. కోట్లాది ప్రాణాలు కలతగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్క శ్వాసలో సరిగమల అపశృతులు సరిచేసుకుంటుంటే.. నా దేశం ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కొన్ని తరాలుగా గాలి బాలు పాటగా, మాటగా ఉనికిని చాటుకుంటూ వీస్తోంది విహరిస్తోంది. ఇపుడు ఓ చిన్ని వెంటిలేటర్ ఇరుకులో చిక్కుకొని విలవిల లాడుతోంది. కొన్నాళ్లుగా ఆకాశపు మౌనం కంటికి మింటికి ఏకధారగా రోధించి.. నిన్నటి నుంచే వెచ్చని సూర్యకిరణాలతో చెక్కల్లు తుడిచుకొని కాస్త తెరిపిన పడుతోంది. అన్నయ్య ఇంకా చాలు. ఇన్ని రోజులుగా నిశ్శబ్ధంగా విశ్రాంతి తీసుకునే హక్కు ఆ కళ నీకు లేవు. తొందరగా కోలుకో. కొత్త పల్లవితో ప్రకృతిని ప్రాణగీతికగా చిగురించనీయి. మా అందరి గొంతులలో కొట్టుకుంటున్న గుండెల సడిని సరిచేయి. చినుకు చమలోమసక బారి పోయిన దిశలకు వెలుగుని నవ్వు వెలుగుతో దారి చూపాలి. రా ఇది నా ప్రార్ధన. శివుడాన కాలేదు. నిన్ను చీమైన కుట్టదు. ఆ సమయం మీద ఆన. నీ తమ్ముడు సీతారాముడు అంటూ సిరివెన్నల బాలూ కోలుకోవాలంటూ ప్రార్ధించారు. సిరివెన్నల సీతారామశాస్త్రితో పాటు ఈ మంగళవారం సాయంత్రం 6 గంటలకు సినీ సంగీత, సాహిత్య లోకానికి చెందిని పలువురు అందరు బాలుగారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని తమదైన రీతితో ప్రార్ధనలు చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.