హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam | గాన గంధర్వుడు SPB కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు..

SP Balasubrahmanyam | గాన గంధర్వుడు SPB కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubrahmanyam: లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందంటూ వైద్యులు తెలపడంతో..

SP Balasubrahmanyam Health Update: లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందంటూ వైద్యులు తెలపడంతో సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ ఎస్పీ బాలు అంటూ హ్యాష్‌ట్యాగ్ మొదలైంది. మీరు త్వరగా కోలుకోవాలి సర్ అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలు మళ్లీ అదే స్వరంతో.. సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని అభిమానులు ప్రాస్థిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా బాలు పేరుతోనే మార్మోగిపోతుంది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ప్రస్తుతం ఈయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 5న ఈయనకు కరోనా నిర్ధరణ అయింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్పటి వరకు నిలకడగానే ఉన్న ఆరోగ్యం ఆగస్ట్ 13 రాత్రి ఒక్కసారిగా విషమించింది. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ పెద్దలు కూడా కంగారు పడుతున్నారు. బాలు వీలైనంత త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు