SP Balasubrahmanyam Health Condition | గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ఆయన మెల్లమెల్గగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు. అలాగే ఈయన ఆరోగ్యం గురించి తరుచూ ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. తాజా హెల్త్ బులెటన్‌లో ఎస్పీబీ ఆరోగ్యంపై మంచి వార్తనే అభిమానులకు చెప్పారు. గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారు. ఈ సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ తనయుడు చరణ్ లేటెస్ట్‌గా విడుదల చేసిన వీడియోలో తెలిపారు.
ఏమైనా అభిమానులు, కోట్లాది ఎస్పీ బాలు అభిమానుల ప్రార్ధన మేరకు ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. గత మూడు నాలుగు రోజులు వచ్చిన ఎస్పీ బాలు హెల్త్ బులెటన్‌లో మాత్రం బాలు ఆరోగ్యం మెరుగుపడుతందనే వార్త రావడం నిజంగానే శుభసూచకం. ఇప్పటికీ ఈయన ఐసియులో వెంటిలేటర్‌పైనే ఉన్నా కూడా మనుషులను గుర్తు పడుతున్నారని చెప్పారు వైద్యులు. తనయుడు చరణ్ కూడా వెళ్లి మాట్లాడి వచ్చాడని చెప్పారు. ఇదే విషయం వీడియోలో కూడా చెప్పాడు ఎస్పీ చరణ్.
నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు ఎస్పీ చరణ్. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పుడు హాస్పిటల్ వర్గాలు కూడా ఎస్పీబీ ఆరోగ్యంపై ఇదే తెలిపారు. లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఎస్పీబీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, S. P. Balasubrahmanyam, SP Charan Singer, Tollywood