గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రహ్మణం తెలుగు వారైనా.. ఆయనకు వివిధ భాషల్లో ఆయన గాత్రానికి అభిమానులున్నారు. ఈయన తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్న గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. కరోనా సోకడంతో పాటు వయసుతో పాటు వచ్చిన సమస్యలు తోడవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వీడియో విడుదల చేసారు.
August 27th, Today’s update from#SpCharan about #SPB ’s Health#SPBalasubramaniam #spbalasubramanyam #spbalasubrahmanyam #GetWellSoonSPB @charanproducer pic.twitter.com/lw0bGLPDDh
— Actor Kayal Devaraj (@kayaldevaraj) August 27, 2020
ఈ సందర్భంగా చెన్నై ఎంజీఎం వైద్యులు తెలియజేసిన విషయాన్ని ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ ఉందని చెప్పారు. ప్రస్తుతం తన తండ్రి బాలూ గారు చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపి అభిమానులకు మంచి కబురు చెప్పారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బాలు మనుపటి కంటే ఆయన ఆరోగ్యం కుదటపడిందనన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే వారం రోజుల్లోనే ఆయనకు అమర్చిన ఎక్మో పరికరాన్ని తొలగించే అవకాశాలున్నాయన్నారు. ఈ సందర్భంగా తన నాన్న కోలుకోవాలని ప్రార్ధించిన అందరికీ మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసారు ఎస్పీ చరణ్. మరోవైపు బాలు ఆరోగ్యం కుదటపడాలని ఎంజీఎం హాస్పటిల్ ఐసీయూ కింది అంతస్తులో వేద పండితులు నిత్యమూ వేద పారాయణం చేస్తున్నారు.ఇదే కార్యక్రమాన్ని బాలూకు చికిత్స చేస్తున్న గదిలో ఉన్న టీవీలో లైవ్ వచ్చే ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, S. P. Balasubrahmanyam, SP Charan Singer, Tollywood