గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రహ్మణం కరోనా కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఎంజీఎం హాస్పటిల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆయన కోలుకోవాలని అభిమానులు చేయని పూజలు లేవు. ఆయన కోసం అభిమానలు చేసిన పూజలు ఫలించాయి. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వర్గాలతో పాటు ఎప్పటి కపుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై వీడియోలను విడుదల చేస్తున్నారు. తాజాగా ఎస్పీ చరణ్ మాట్లాడుతూ. .. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రస్తుతం బాలు గారికి వెంటిలేటర్‌తో పాటు ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్లు ఎస్పీబీకి ఫిజియోథెరపీ చికిత్స అందించినట్టు తెలిపారు.. మరోవైపు నిన్నటితో పోలిస్తే.. ఆరోజు నాన్నగారి ఆరోగ్యం మెరుగైందన్నారు. అందరి ప్రార్దనల ఫలితంగా ఆయన త్వరగా కోలుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి చరణ్.. పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై తాజగా ఓ బులెటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్టు తెలిపారు. మునుపటి కంటే ఆయన ఆరోగ్యం మెరుగైనట్టు తెలిపారు. ఆయన అందరినీ గుర్తు పడుతున్నట్టు తెలిపారు.

SP బాలు ఆరోగ్య బులెటిన్ విడుదల చేసిన MGM హాస్పిటల్
మరోవైపు బాలు ఆరోగ్యం కుదటపడాలని ఎంజీఎం హాస్పటిల్ ఐసీయూ కింది అంతస్తులో వేద పండితులు నిత్యమూ వేద పారాయణం చేస్తున్నారు.ఇదే కార్యక్రమాన్ని బాలూకు చికిత్స చేస్తున్న గదిలో ఉన్న టీవీలో లైవ్ వచ్చే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:August 28, 2020, 20:39 IST