SP Balasubrahmanyam Health Condition | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగువుతుంది. మెల్లగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు చరణ్ కూడా తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసాడు. నిన్నటి నుంచి ఆయన ఆహారం తీసుకుటున్నారని చరణ్ తెలిపారు. అంతేకాదు డాక్టర్లు సాయంతో 15 నుంచి 20 నిమిషాలు లేచి కూర్చుకుంటున్నట్టు తెలిపారు. చివరగా నాన్న ఆరోగ్యంపై సెప్టెంబర్ 16న అప్‌డేట్ ఇచ్చినట్టు చెప్పారు.ఐతే.. ప్రస్తుతం బాలు కరోనా నుంచి కోలుకున్నా.. ఇప్పటికీ ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలిపసారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ లేవని చెప్పుకొచ్చారు.
Latest Health Update of #SPBalasubramanyam garu by #SPCharan pic.twitter.com/MNTCfro2Ba
— BARaju (@baraju_SuperHit) September 19, 2020
ప్రస్తుతం నాన్న లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అది ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం డాక్టర్లు నాన్న గారికి ఫిజియోథెరపీని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఎంజీఎం వైద్యులు నర్సుల సాయంతో రోజు 15 నుంచి 20 నిమిషాలు లేచి కూర్చునట్టు తెలిపారు. ఎస్పీ బాలు గారు ఆగష్టు 5న కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.