హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాలు హెల్త్ బులెటన్ విడుదల.. పరిస్థితి అత్యంత విషమం..

SP Balasubrahmanyam: ఎస్పీ బాలు హెల్త్ బులెటన్ విడుదల.. పరిస్థితి అత్యంత విషమం..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన కోలుకుంటున్నారని.. వైద్యానికి స్పందిస్తున్నాడంటూ తనయుడు చరణ్ తెలిపాడు. అయితే గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం మళ్లీ విషమించింది.

ఇంకా చదవండి ...

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన కోలుకుంటున్నారని.. వైద్యానికి స్పందిస్తున్నాడంటూ తనయుడు చరణ్ తెలిపాడు. అయితే గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం మళ్లీ విషమించింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఆయన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ ఎంజిఎం హాస్పిటల్ హెల్త్ బులెటన్ విడుదల చేసింది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలుకు ఏం కాకుండా చూడాలంటూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబర్ 24 సాయంత్రం 6.30 నిమిషాలకు హెల్త్ బులెటన్ విడుదల చేసారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

బాలు ఆరోగ్యం కొన్ని రోజులుగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికీ బాలు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఇప్పటికీ ఈయన పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఇప్పుడు అది మరింత విషమించిందని తెలిపారు వైద్యులు. ఆయనకు కొన్ని రోజులుగా లైఫ్ సపోర్ట్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్మో (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంటే పేషెంట్ గుండె, ఊపిరితిత్తులకు అదనపు మద్దతు అందించడం అన్నమాట. అలా బాలుకు చికిత్స చేస్తున్నారు. హార్ట్ అండ్ లంగ్స్ బైపాస్ కింద పని చేస్తుందన్నమాట ఇది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం(File/Photo)
ఎస్పీ బాలసుబ్రమణ్యం(File/Photo)

కృత్రిమ ఊపితిత్తుల ద్వారా రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. విదేశీ వైద్యులు ఈయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఊపిరితిత్తులలోకి వెంటిలేటర్ ఆక్సీజన్ నిండిన గాలిని పంపిస్తే.. ఈసీఎంఓ పంప్స్ రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సీజన్ నింపిన రక్తాన్ని పంపిణి చేస్తుంది. దానివల్ల పేషెంట్ శరీరం చికిత్సకు స్పందించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పద్దతినే బాలు కోసం వాడుతున్నారు వైద్యులు. ఇదంతా చూస్తుంటే బాలు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని అర్థమవుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత అభిమానులు, సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood