హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా అప్‌డేట్..

SP Balasubrahmanyam: ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా అప్‌డేట్..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలించాయి. ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా నయం అవుతుంది.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలించాయి. ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా నయం అవుతుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఈయన ఆరోగ్యం గురించి తరుచూ ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. తాజా హెల్త్ బులెటన్‌లో ఎస్పీబీ ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని.. అయితే చికిత్సకు స్పందిస్తున్నాని తెలిపారు. కరోనాతో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందని చెప్పడం శుభసూచకం.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ప్రతీరోజూ హెల్త్ బులెటన్‌లో విషమంగానే ఉంది.. ఐసియులో ఉన్నారు.. వెంటిలేటర్‌పై చికిత్స సాగుతుందంటూ వచ్చేది. కానీ తాజాగా వచ్చిన బులెటన్‌లో మాత్రం బాలు ఆరోగ్యం మెరుగుపడిందని రావడం నిజంగానే శుభసూచకం. ఇప్పటికీ ఈయన ఐసియులో వెంటిలేటర్‌పైనే ఉన్నా కూడా మనుషులను గుర్తు పడుతున్నారని చెప్పారు వైద్యులు. తనయుడు చరణ్ కూడా వెళ్లి మాట్లాడి వచ్చాడని చెప్పారు. ఇదే విషయం వీడియోలో కూడా చెప్పాడు ఎస్పీ చరణ్.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)

ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నాడని.. డాక్టర్స్‌కు అలాగే వైద్యానికి స్పందిస్తున్నారని చివరి వీడియోలోచెప్పుకొచ్చాడు చరణ్. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు ఎస్పీ చరణ్. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పుడు హాస్పిటల్ వర్గాలు కూడా ఎస్పీబీ ఆరోగ్యంపై ఇదే తెలిపారు. లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఎస్పీబీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు