హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణతో ఎస్పీ బాలుకు మనస్పర్థలు ఎలా వచ్చాయంటే....

SP Balasubrahmanyam: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణతో ఎస్పీ బాలుకు మనస్పర్థలు ఎలా వచ్చాయంటే....

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,కృష్ణ (File/Photo)

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,కృష్ణ (File/Photo)

SP Balasubrahmanyam Super Star Krishna | తెలుగు ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు గాంచిన ఎస్పీబాల సుబ్రహ్మణ్యంకు ఓ విషయంలో కృష్ణతో మనస్పర్థలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

  SP Balasubrahmanyam Super Star Krishna | తెలుగు ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు గాంచిన ఎస్పీబాల సుబ్రహ్మణ్యంకు ఓ విషయంలో కృష్ణతో మనస్పర్థలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో గాయకుడిగా ఘంటసాలనే పెద్ద హీరోలకు పాటలు పాడేవారు. బాలు అపుడే గాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలు అప్పటి అప్‌కమింగ్ హీరోలుగా ఉన్న కృష్ణ, శోభన్ బాబులతోపాటు కమెడియన్లకు పాటలు పాడేవారు. ఇలాంటి సమయంలో కృష్ణ.. తాను యాక్ట్ చేసే సినిమాలకు ఎస్పీ బాలు గారినే గాయకుడిగా ప్రోత్సహించారు. ముందుగా కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో తొలిసారి అన్ని పాటలు బాలుగారితో పాడించారు కృష్ణ. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉండేది.ఆ తర్వాత అదే చనువుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కృష్ణ హీరోగా కొంత మంది వేరే నిర్మాతలతో కలిసి కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ‘కెప్టెన్ కృష్ణ’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కాకపోయినా.. ఓ మోస్తరుగా నడిచింది.

  కెప్టెన్ కృష్ణ (File/Photo)

  ఆ సినిమా సమయంలో బాలుగారు, కృష్ణగారికి ఇవ్వాల్సిన పూర్తి పారితోషం ఇవ్వలేకపోయారు. కృష్ణ కూడా బాలు ఇబ్బందులను గమనించి ఆ రెమ్యునరేషన్ విషయాన్ని మరిచిపోయారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత విజయ నిర్మల తన ఓన్ ప్రొడక్షన్స్ విజయ కృష్ణ బ్యానర్‌లో పాటలు పాడాలని బాలును కోరారు.ఈ సందర్భంగా బాలు... ఈ బ్యానర్‌లో అంతకు క్రితం తనకు రావ్వాల్సిన పారితోషకం ఇస్తే పాడుతా అని కబురుచేసారట. దీంతో కృష్ణ.. అప్పట్లో కెప్టెన్ కృష్ణ సమయంలో తనకు రావాల్సిన పారితోషకం ఇవ్వాలంటూ చెబుతూ.. ఎస్పీ బాలుకు కబురు చేస్తూనే.. బాలుకు విజయ నిర్మల బాకీ ఉన్న పారితోషకాన్ని పంపించారు. అదే సమయంలో కృష్ణ. బాలుతో నువ్వు లేకుంటే నా సినిమాలు రిలీజ్ కావని చెప్పావట అని నిలదీసారట. కానీ బాలు మాత్రం ఎవరో గిట్టని వాళ్లు చెప్పిన దాన్ని కృష్ణ అపార్ధం చేసుకున్నారని మిన్నకుండిపోయారట బాలు. అదే సమయంలో తమకు రావాల్సిన రెమ్యునరేషన్ పంపించమని కృష్ణ కోరారు. ఆ సమయంలో బాలు గారు కృష్ణ గారికి ఇవ్వాల్సిన బాకీ తీర్చేసారు.

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,కృష్ణ (File/Photo)

  ఆ తర్వాత కృష్ణ, విజయనిర్మల దర్శకత్వంలో ‘సూర్య చంద్ర’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలను బాలుతో కాకుండా రాజ్ సీతారామ్‌తో పాడించాలని కోరారు కృష్ణ. అప్పటి నుంచి కొన్నేళ్ల వరకు కృష్ణ నటించిన పలు చిత్రాలకు రాజ్ సీతారామే పాటలు పాడారు. వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినా.. కృష్ణగారు తన సినిమాల్లో బాలు చెల్లెలు ఎస్పీ శైలజతో పాటలు పాడించారు.

  రౌడీ నెం. 1 (File/Photo)

  ఆ తర్వాత కొన్నేళ్లుకు కృష్ణ .. రవిచంద్ర దర్శకత్వంలో ‘రౌడీ నెంబర్ 1’ సినిమా చేసే సమయంలో సంగీత దర్శకుడు రాజ్‌ కోటి కృష్ణగారి దగ్గరికి వెళ్లి ఈసినిమాలో పాటలు బాలు గారితో పాడిస్తే బాగుంటుందని కోరారు. అలా వేటూరి మధ్యవర్తిత్వంతో బాలుగారిని ఒప్పించారు. బాలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పద్మాలయా స్టూడియోలో కృష్ణగారిని కలవడానికి వెళ్లారు.  ఆ వెంటనే ఇంతకు ముందు జరిగిన విషయాలను ఇద్దరం మరిచిపోదాం అంటూ మనద్దరం కలిసి పనిచేస్తున్నాం అంటూ కృష్ణగారు బాలుగారితో అనడం.. అప్పటి నుంచి మరళా కృష్ణగారికి బాలు గారు పాడటం తిరిగి మొదలైంది.  అలా టీ కప్పులో తుఫానులా బాలు, కృష్ణ మధ్య ఉన్న వివాదం సద్దు మణిగింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Krishna, S. P. Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు