SP Balasubrahmanyam: ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందే.. అభిమానుల డిమాండ్..

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం అనేది పేరు కాదు.. అదో చరిత్ర. మరిచిపోలేని అధ్యాయం.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. 50 ఏళ్లు సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాజు. పాటల పూదోటలో రారాజు.. ఈయన గురించి ఇలా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2020, 10:06 PM IST
SP Balasubrahmanyam: ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందే.. అభిమానుల డిమాండ్..
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)
  • Share this:
ఎస్పీ బాలసుబ్రమణ్యం అనేది పేరు కాదు.. అదో చరిత్ర. మరిచిపోలేని అధ్యాయం.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. 50 ఏళ్లు సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాజు. పాటల పూదోటలో రారాజు.. ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత రాసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే బాలు అంటే కారణజన్ముడు అంతే. అలాంటి గాయకుడు.. లెజెండరీ పర్సనాలిటీ మళ్లీ పుట్టడం కూడా అసాధ్యం. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు బాలు. ఈయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదేమో..?

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


ఎందుకంటే 17 భాషలు.. 45 వేల పాటలు అంటే చిన్న విషయం కాదు. ప్రపంచంలో మరే గాయకుడికి సాధ్యం కాని రికార్డు ఇది. తెలుగులో ఘంటసాల లాంటి గాయకుడు మరణించిన తర్వాత ఆయన్ని మరిపించే గాయకుడు మళ్లీ వస్తాడా అంటే ఎస్పీ బాలు నేనున్నానంటూ వచ్చాడు. 5 దశాబ్ధాలుగా ఈయన అద్భుతమైన స్వరాన్ని మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ కంఠం మూగబోయింది.. స్వరం పాడి అలిసిపోయింది. ఇక సెలవు అంటూ మరలిరాని లోకాలకు తరలిపోయింది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు (SP Balasubrahmanyam last rites)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubrahmanyam)


ఈ గాన గంధర్వుడి పాట అక్కడ గంధర్వులకు వినాలనిపించిందో ఏమో కానీ వాళ్లు ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటే ఎస్పీ బాలసుబ్రమణ్యానికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ అభిమానుల నుంచి డిమాండ్స్ మొదలయ్యాయి. సంగీత ప్రపంచానికి ఈయన చేసిన సేవలు మాటల్లో చెప్పడం సాధ్యం కాదని.. భారతీయ సంగీతం అంటే బాలు అనే స్థాయికి ఆయన ఎదిగిన విషయం గుర్తించుకోవాలంటున్నారు అభిమానులు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


అలాగే ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ సంగీత దర్శకుడు కోటితో పాటు జానకమ్మ, చిత్ర లాంటి వాళ్లు కూడా బాలుకు భారతరత్న ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. అది ఆయనకు మనం ఇచ్చుకునే గౌరవం అంటున్నారు వాళ్లు. ఇప్పటికే బాలసుబ్రమణ్యంకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మభూషణ్ సత్కారాలు పురస్కరించింది. 2001లో పద్మ శ్రీ.. 2011లో పద్మభూషణ్ ఈయన్ని వరించాయి. భారతరత్న కూడా ఇవ్వాలంటూ ఇప్పుడు అభిమానుల నుంచి డిమాండ్ వస్తుంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం మన్నిస్తుందో లేదో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 25, 2020, 10:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading