హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లు ఎంత?

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లు ఎంత?

ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. అయితే మధ్యలో మళ్లీ నయం అయిపోయింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరగా కోలుకుని వచ్చేస్తానంటూ బాలు కూడా వీడియోలు పెట్టాడు. దాంతో అంతా ధైర్యంగానే ఉన్నారు. కానీ ఉన్నట్లుండి సెప్టెంబర్ 23 నుంచి ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది.

ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. అయితే మధ్యలో మళ్లీ నయం అయిపోయింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరగా కోలుకుని వచ్చేస్తానంటూ బాలు కూడా వీడియోలు పెట్టాడు. దాంతో అంతా ధైర్యంగానే ఉన్నారు. కానీ ఉన్నట్లుండి సెప్టెంబర్ 23 నుంచి ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది.

SP Balasubrahmanyam Hospital Bill | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుమారు 50 రోజుల పాటు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

  కోట్లాది మంది అభిమానులకు గుడ్ బై చెప్పి ఎస్పీ బాలు వెళ్లిపోయారు. గాన గంధర్వుడు దివికేగాడు. బాలు గొంతు మూగబోయింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి ప్రతి ఇంట్లోనూ, ప్రతి నాలుక మీద నాట్యమాడిన గొంతు ఇక వినిపించదు. తన పాటలు,పదాలు, మాటలు అన్నీ అభిమానులకు వదిలి వెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం కోట్లాది మంది అభిమానుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే. ఎస్పీ బాలు ఆస్పత్రి బిల్లు ఎంత అయి ఉంటుంది?

  సాధారణంగా చిన్న జబ్బుకే జనాన్ని దోచుకుంటున్నాయి ఆస్పత్రులు. ఇటీవల కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి కరోనా పేషెంట్‌కు ఏకంగా రూ.30 లక్షల బిల్లు వేసింది. పేషెంట్ చనిపోయినా కూడా డబ్బులు కట్టించుకుని మరీ వదిలిపెట్టే ఆస్పత్రులు ఉన్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5 నుంచి ఆస్పత్రిలో ఉన్నారు. సెప్టెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. అంటే సుమారు 50 రోజుల పాటు బాలు ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ 50 రోజుల కాలంలో బాలుకి కరోనా చికిత్స జరిగింది. ఆయనకు కరోనా వైరస్ తగ్గినట్టు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. అందుకోసం వెంటిలేటర్ పెట్టారు. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఐసీయూలో ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి పలుమార్లు ప్రకటించిన ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అంటే, ఇవన్నిటికీ ఎంత ఖర్చయి ఉంటుందనే అంశాన్ని అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘బాగా గట్టిగానే వసూలు చేసి ఉంటారు.’ అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

  ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పుడూ హాస్పిటల్ మెట్లు ఎక్కినట్లు కానీ.. ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు కానీ ఎక్కడా చదవలేదు. రాలేదు కూడా. అయినా కూడా ఇప్పుడు కరోనాతో నెల రోజులు పోరాడి గెలిచాడు ఈయన. నెగిటివ్ వచ్చిన తర్వాత బాలసుబ్రమణ్యం మరణించాడు. కేవలం వయసు భారమే అనుకున్నా కూడా చాలా మంది బయటపడుతున్నారు. కానీ బాలు పరిస్థితి అది కాదు.. ఆయన పరిస్థితి విషమించడానికి ప్రత్యేక కారణం ఒకటి ఉంది. గతేడాది ఆయన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నట్టు తెలిసింది. అంటే బరువు తగ్గడం కోసం చేసే ఓ ఆపరేషన్ అన్నమాట. వయసు పెరిగిపోతుండటంతో బరువు తగ్గకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని భావించిన బాలు.. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే కాస్త బరువు కూడా తగ్గి ఉత్సాహంగా మారిపోయాడు. ఇలా ఆయన్ని చూసిన వాళ్లంతా కూడా ఏమైందని అడిగితే.. నాకేంటి బాగానే ఉన్నాను.. లావుగా ఉన్నపుడు ఎవరూ అడగరు కానీ సన్నగా అయితే అడుగుతారా అంటూ కామెడీ కూడా చేసారు. అలాంటి బాలు ఇలా అందరికీ దూరమైపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

  గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఎస్పీ బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు