హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణం కన్నుమూయడానికి ఆ టీవీ ప్రోగ్రామే కారణమా..

SP Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణం కన్నుమూయడానికి ఆ టీవీ ప్రోగ్రామే కారణమా..

సహజత్వం ఉట్టి పడేలా విగ్రహాలను తీర్చి దిద్దడం రాజ్ కుమార్ ప్రత్యేకత. బాలు విగ్రహంలోనూ ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బాలు విగ్రహాలను తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టించాలనే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. అభిమానులు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు.

సహజత్వం ఉట్టి పడేలా విగ్రహాలను తీర్చి దిద్దడం రాజ్ కుమార్ ప్రత్యేకత. బాలు విగ్రహంలోనూ ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బాలు విగ్రహాలను తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టించాలనే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. అభిమానులు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు.

SP Balasubrahmanyam:గాన గంధర్వుడు  ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని  ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బాలు లేడనే వార్త కూడా నమ్మబుద్ధి కావడం లేదు. ఎస్పీ బాలు మరణానికి ఆ ప్రోగ్రామే కారణంటూ బాలు అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

    SP Balasubrahmanyam | గాన గంధర్వుడు  ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని  ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బాలు లేడనే వార్త కూడా నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆయన పాట లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే పైగా ఎప్పుడూ కెమెరా ముందు చిరునవ్వుతో కనిపించే బాలు ఇలా ఉన్నట్లుండి దూరమైపోవడం తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఇది నిజంగానే జీర్ణించుకోలేని వార్త. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఆయన చనిపోవడానికి బేరియాట్రిక్ సర్జరీతో పాటు ఓ ప్రోగ్రామ్ కూడా కారణమనే అంటున్నారు. కరోనా విలయ తాండవం చేస్తోన్న వేళ.. 74 ఏళ్ల వయసున్న ఓ పెద్ద మనిషిని ఓ టీవీ షోకు ముఖ్యఅతిథిగా పిలవడం ఆయన చనిపోవడానికి కారణమైందని సోషల్  మీడియా వేదికగా ఎస్పీ బాలు అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆ షో నిర్వాహకుల వల్లే.. ఎపుడు నవ్వుతూ ఉండే ఆ మహామనిషిని సంగీతాభిమానులకు దూరం చేసిందని చెబుతున్నారు.

    These are the films made by SP Balasubrahmanyam as the producer,SP Balasubrahmanyam Passes Away,SP Balasubrahmanyam as the producer,SP Balasubrahmanyam producer,SP Balasubrahmanyam as the producer bhamane sathya bhamane,SP Balasubrahmanyam as the producer aditya 369,SP Balasubrahmanyam as the producer shubha sankalpam,SP Balasubrahmanyam as the producer captain krishna,SP Balasubrahmanyam Music Direction,SP Balasubrahmanyam Music director,SP Balasubrahmanyam Awards,SP Balasubrahmanyam National Awards,SP Balasubrahmanyam Padma Shree,SP Balasubrahmanyam Padma bhushan,SPB Death News,SP Balasubrahmanyam, SP Balasubrahmanyam death, SP Balasubramiyam, SPB Death, SPB Death news, News about SPB Death, News about SP Balasubrahmanyam death, RIP SP Balasubrahmanyam, RIP SPB, SPB Age, SPB Images, SPB Photo, SPB Latest news, Coronavirus, Covid 19,sp balasubrahmanyam,Legendary Singer SP Balasubrahmanyam Passes Away,SP Balasubrahmanyam No More,SP Balasubrahmanyam Died,SP Balasubrahmanyam no alive,SP Balasubrahmanyam,SP Balu No more,Sp Balu Passes Away,Sp Balu died,sp balu,balu songs,s. p. balasubrahmanyam,sp balasubrahmanyam songs,sp balasubrahmanyam live,best of sp balasubrahmanyam,sp balasubrahmanyam melodies,90s sp balasubrahmanyam love hits,sp balasubrahmanyam audio jukebox,sp balasubrahmanyam songs collection,evergreen hits of sp balasubrahmanyam,sp balasubrahmanyam latest hits of 90s,sp balasubrahmanyam best romantic duets,nonstop romantic hits of sp balasubrahmanyam,sp balasubrahmanyam old hindi songs collection,tollywood,bollywood,kollywood,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు,బాలు పాటలు,బాలు గాత్రం,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ సాంగ్,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడుతా తీయగా,కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు,స్వర్గస్థులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలు గానాలు,కోవిడ్‌తో ఎస్పీ బాలు కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్,ఎస్పీ బాలు సంగీతం,ఎస్పీ బాలు సంగీతం అందించిన చిత్రాలు
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Facebook/Photo)

    అసలు బాలుగారు ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లకపోయివుంటే.. ఇంత అనర్ధం జరిగిండేది కాదని అంటున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు 60 ఏళ్లు పై పడిన వారిని అసలు బయటకు రానీయకండా.. ఇంట్లోనే ఉండాలి. వాళ్లతో ఎలాంటి షూటింగ్స్ గట్రా చేయకూడదనే నిబంధనలున్నాయి.  అలాంటి నియమ నిబంధనలు ఉల్లంఘించి ఆయనను ప్రోగ్రామ్‌కు అతిథిగా పిలవడం ప్రోగ్రామ్ నిర్వాహకులు చేసిన పెద్ద తప్పు అంటున్నారు. కనీసం బాలు గారి కుటంబ సభ్యులైన ఆయన్ని ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లనీయకుండా ఉంటే బాగుండేదని అంటున్నారు.

    SP Balasubrahmanyam Got many national international and regional awards here are the list
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Photo/Facebook/SP Balu)

    అసలే కరోనా వైరస్.. పాటలు పాడినా.. గట్టిగా మాట్లాడిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. జూలై 30న ఆయన ‘సామజవరగమనా’ అనే టీవీ షోకు హాజరయ్యారు. ఇక ఈ షోకు హాజరైన వారందరికీ కరోనా సోకింది. అందులో బాలుగారు కూడా ఉన్నారు. మిగతా వారి ఏజ్ 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉండటంతో వారందరు కరోనా నుంచి కోలుకున్నారు. కానీ 74 ఏళ్ల ఎస్పీ బాలు మాత్రం కరోనా సోకి .. చివరకు అది తగ్గినా.. అప్పటికే కరోనా ఎస్పీ బాలు శరీరంలోని అన్ని అవయవాలతో పాటు లంగ్స్‌‌ను పూర్తిగా దెబ్బతీసింది.

    sp balasubrahmanyam no more celebrities paid tributes to him
    ఎస్పీ బాలు (SP Balu)

    నిర్వాహకులు ఆయన వయసును దృష్టిలో పెట్టుకోలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన్ని ముఖ్య అతిథిగా పిలవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు ఆయన అభిమానులు. మొత్తంగా ఓ టీవీ ఛానెల్ నిర్వాహకులు చేసిన తప్పిదంతో సినీ ప్రేమికులు ఓ లెజెండ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అపుడు ఆ ప్రోగ్రామ్ జరగపోతే.. ఎవరి కొంపలు మునిగిపోయే పరిస్థితి లేదంటున్నారు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా.. దాని బారి నుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకు అవగాహన లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బాలు వంటి అమర గాయకుడికి రావాల్సిన కష్టం కాదిది అంటూ కన్నీటీ పర్యంతమవుతున్నారు అభిమానులు. అసలు వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారికి అసలు కసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదంటున్నారు. మొత్తానికి ఓ ప్రోగ్రామ్ నిర్వాహకులు  చేసిన కోలుకోలేని పెద్ద తప్పుతో పెద్ద లెజెండ్‌‌ను కోల్పోవాల్సి వచ్చింది. 

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood

    ఉత్తమ కథలు