హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: బాలుకు శంకరాభరణం గానంతో నివాళులు అర్పించిన కీరవాణి..

SP Balasubrahmanyam: బాలుకు శంకరాభరణం గానంతో నివాళులు అర్పించిన కీరవాణి..

శంకరాభరణం గీతంలో బాలుకు కీరవాణి నివాళి (Twitter/Photo)

శంకరాభరణం గీతంలో బాలుకు కీరవాణి నివాళి (Twitter/Photo)

SP Balasubrahmanyam: గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ ఈనెల 25న    తుది శ్వాస విడిశారు. ఆయన మృతిపై పలువురు పలు రకాలుగా నివాళులు అర్పించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. బాలుకు శంకరాభరణం పాట రూపంలో నివాళులు అర్పించారు.

ఇంకా చదవండి ...

  SP Balasubrahmanyam: గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ ఈనెల 25న    తుది శ్వాస విడిశారు.  ఆయన వయసు 74 సంవత్సరాలు.  గత 52 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. పైనున్న ఆ దేవుడికి ఆ గాన గంధుర్వుడి గాన మాధుర్యం వినిలానిపించిందేమో.. ఆయన దగ్గరకు పిలిపించుకున్నట్టున్నారు. ఆయన మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాదితో పాటు మొత్తంగా భారతీయ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. ఎస్పీ బాలు విషయానికొస్తే.. ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలిచాయి. ఆయన పాట శ్రోతలకు పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. ఆయన కన్నుమూయడంతో కీరవాణి.. బాలుపై తనదైన శైలిలో 4 ఏళ్ల క్రితం  పాడిన పాత పాటను ఇపుడు అభిమానులు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం బాలు ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తైన సందర్భంగా కీరవాణి ఈ పాటను పాడారు.

  బాలసుబ్రహ్మణ్యంకు తొలిసారి జాతీయ అవార్డు తీసుకొచ్చిన ‘శంకరాభరణం’ సినిమాలో ఓంకార నాదాలు పాటను.. 50 వసంతాలు శ్రవణామృతము కురిసేనే..బాలుగారి గళము అంటూ కీరవాణి ఈ పాటను పాడారు. ఇందులో ఆయన స్వర ప్రస్థానముతో పాటు అవార్డులు, రివార్డుల సంగతిని ఇందులో పొందు పరిచారు.  భారత స్వర శిఖరము అంటూ కీరవాణి పాడిన ఆ పాటను ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: M. M. Keeravani, S. P. Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు