హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యంకు అమూల్ నివాళులు..

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యంకు అమూల్ నివాళులు..

ఎస్పీ బాలుకు అమూల్ నివాళి (Twitter/Photo)

ఎస్పీ బాలుకు అమూల్ నివాళి (Twitter/Photo)

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా అమూల్ పాల సంస్థ... ఎస్పీ బాలుకు తనదైన శైలిలో నివాళులు అర్పించింది.

 • Advertorial
 • Last Updated :

  SP Balasubrahmanyam: గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఎస్పీ బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఆయన మరణంతో భారతీయ సినీ జగత్తులో ఒక శకం ముగిసింది. 50 ఏళ్లు సినీ సంగీతాన్ని తన గళంతో శాసించాడు. ఆయన గురించి ఎంత చెప్పినా.. సముద్రంలో నీటి చుక్కంత.  కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు బాలు. ఈయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ప్రముఖ దిగ్గజ పాల డెయిరీ అమూల్ సంస్థ నివాళులు అర్పించింది.

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అమూల్ బేబితో కలిసి పాట పాడుతున్నట్లుగా కార్టూన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆ మహా గాయకుడికి నివాళులు అర్పించింది. ‘ఏక్ దూజే లియే’ హిందీ చిత్రంలో బాలు, లతా మంగేష్కర్‌తో కలిసి పాడిన ‘తేరే మేరే బీచ్ మే ఐసా కోయి బంధన్ అంజానా’ అంటూ పాడిన పాటను కోడ్ చేసారు. తొలిసారి బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఏక్ దూజే కే లియే’ సినిమాతో బాలీవుడ్‌లో తనదైన గాన మాధుర్యాన్ని అందించారు. ఈ చిత్రం తెలుగులో హిట్టైన ‘మరో చరిత్ర’ సినిమాకు రీమేక్. ఈ సినిమాలో తేరే మేరే బీచ్ మే అనే పాటకు బాలుగారు రెండోసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఒక ప్రాంతీయ భాషకు చెందిన గాయకుడు.. హిందీలో అవార్డు అందుకోవడం అనేది ఒక రికార్డు. ఆ రికార్డును బాలు సుసాధ్యం చేసారు. అప్పట్లో లక్ష్మీ కాంత్ ప్యారేలాల్‌.. బాలును ఈ పాట కోసం వద్దనన్నారు. కానీ బాలచందర్.. ఈ సినిమాలో హీరో కమల్ హాసన్.. ఒక హిందీయేతరుడు తమిళన్ కాబట్టి.. బాలచందర్ పట్టు పట్టేసరికి  లక్ష్మీకాంత్ ప్యారేలాల్ చేసేది ఏమి లేక బాలుతో  పాట పాడించడం జరిగింది. ఆ తర్వాత ‘మైనే ప్యార్ కియా’, ‘సాజన్’, ‘హమ్ ఆప్కే హౌ కౌన్’ వంటి పలు చిత్రాల్లో గాన మాధుర్యంతో అలరించారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, S. P. Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు