SP Bala Subrahmanyam | తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల్లో తన గానమృతంతో ఎంతో మంది శ్రోతలను మైమరిపించిన గాయకుడు పద్మ భూషణ్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఈ గాన గంధర్వుడు ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిప్పరాజు వారి వీధిలో ఉన్న ఆయన సొంతి ఇంటిని వేద పాఠశాల నిర్వహణకు ఇవ్వబోతున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తన సొంత ఇంటిని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి అప్పగించారు. ఈ సందర్భంగా తన ఇంట్లో కంచి పీఠాధిపతికి పూజాలు నిర్వహించి.. తన ఇంటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కంచి పీఠానికీ తన ఇంటిని అప్పగించిన బాలును విజయదేంద్ర సరస్వతిగారు అభినందించారు. ఇక బాలు సొంతింట్లో వేద విద్యార్థులకు వేద పాఠశాలను నిర్వహించే విషయాలను తెలియజేస్తామని కంచి మఠం ప్రతినిధులు తెలిపారు.
దక్షిణాది, ఉత్తరాది భాషలనే కాకుండా.. మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గాయకుడిగా ప్రత్యేక స్థానం ఉంది. మొత్తంగా అన్ని భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు నాలుగు భాషల్లోని ఆరు జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక గాయకుడిగా కూడా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.