సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రదానం చేసిన వాళ్లలో ఫేమస్ సింగర్ ఒకరు మృతి చెందారు. ఏడాది కాలంలో ఎందరో సంగీత కళాకారుల్ని కోల్పోయిన భారత దక్షణాది చిత్రపరిశ్రమకు సింగర్ సంగీత సజిత్ రూపంలో మరో మధురగాయని దూరమైంది. తమిళనాడు(Tamilnadu) రాష్ట్రానికి చెందిన ప్రముఖ దక్షిణాది భాషల సినిమాల్లో తన స్వరాన్ని అందించి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన నేపథ్య గాయని(South Indian playback singer)సంగీత సజిత్(Sangeetha Sajith)ఇకలేరు. గత కొంత కాలంగా కిడ్నీ( kidney)సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ సంగీత ఆదివారం ఉదయం కన్నుమూశారు. తిరువానంతపురం (Thiruvananthapuram)లోని తన సోదరి నివాసంలో తుదిశ్వాసవిడిచారు సంగీత సజిత్.
మధుర గాయని మరిలేరు..
46సంవత్సరాల నేపథ్య గాయని సంగీత సజిత్..తమిళ, కన్నడ,తెలుగు భాషల సినిమాల్లో పాటలు పాడారు.చనిపోయే ముందు వరకు ఆమె సుమారు 200పాటలు పాడారు. దక్షిణాది సినిమాల్లో ఆమె జోష్ నింపే పాటలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన తమిళ సినిమా మిస్టర్ రోమియోలో తన్నెరై కథలిక్కుమా అనే పాట ఆమె కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్గా నిలిచింది. సంగీత సజిత్కు బాగా గుర్తింపు తెచ్చి పెట్టింది.
సంగీత లోకానికి తీరని లోటు..
మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ నటించిన 'కురుతి' సినిమాలోని థీమ్ సాంగ్ సంగీత సజిత్ పాడిన చివరి పాట కావడం విశేషం. కేవలం కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఈ సూపర్ సింగర్ ఆకాల మరణ వార్త తెలిసి దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు దిగ్బ్రాంతి లోనయ్యారు.సింగర్ సంగీత సజిత్ మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సంగీత సజిత్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. తమిళాడు తిరువానంతపురంలోని థైకాడ్లోని శాంతికవాదం పబ్లిక్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Malayala Cinema, Tamil Film News