SOUTH STARS VIMALA RAMAN VINAY RAI TO GET MARRIED SB
విలన్‌ను పెళ్లాడబోతున్న హీరోయిన్.. త్వరలోనే వెడ్డింగ్ డేట్ రిలీజ్?
విమల రావన్.. వినయ్ రాయ్ పెళ్లి
గత కొంతకాలంగా ఈ జంట క్లోజ్‌గా మూవ్ అవుతోంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని అంతా అనుకున్నారు. అందరూ భావించినట్లే త్వరలో ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వనుంది.
సినిమాల్లో నటీనటులు మధ్య ప్రేమలు పెళ్లిళ్లు చాలా కామన్. ప్రేమించుకోవడం ఆ తర్వాత కలిసి బతకాలంటే పెళ్లి చేసుకోవడం చేస్తుంటారు. తాజాగా మరో జంట లవ్ ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం మనం చూశాం. కానీ ఓ నటి మాత్రం విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. వాళ్లెవరో కాదు... విమలా రామన్- వినయ్ రాయ్.
తమిళ నటుడిగా, విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వినయ్ రాయ్. ఇక వినయ్‌తో ప్రేమలో పడింది టాలీవుడ్ హీరోయిన్ విమలా రామన్. ఈ జంట గత కొద్ది కాలంగా లవ్‌లో ఉంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ట్రిప్పులు, షికార్లకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఇంకెందుకు ఆలస్యం అని పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసింది. త్వరలో మూడు ముళ్ల బంధంతో ఈ లవ్ కపుల్ ఒక్కటవ్వబోతున్నారు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దల్ని కూడా ఒప్పించారు. దీంతో విమలా రామన్.. వినయ్ రాయ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం.
విమలా రామన్ ఓ మోడల్. హీరోయిన్ కాకముందు ఆమె మోడలింగ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి అవకాశాలు రావడంతో హీరోయిన్గా మారారు. ముందుగా మళయాళ సినిమాల్లో నటించారు విమలా రామన్. ఆ తర్వాత ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు రావడంతో... తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ''గాయం-2, చట్టం, ఎవరైనా.. ఎపుడైనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి'' లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక వినయ్ రాయ్ విషయానికొస్తే.. 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో తమిళ నటుడిగా పరిచయమై 'జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై' లాంటి సినిమాల్లో హీరోగా చేసి 'డిటెక్టివ్, చంద్రకళ, వరుణ్ డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు)'' తదితర సినిమాల్లో విలన్ పాత్రలో మెప్పించాడు. దీంతో ఇప్పుడు విలన్ ఓ హీరోయిన్ పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. మరి వీరి పెళ్లికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తోందోనని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.