హోమ్ /వార్తలు /సినిమా /

Shruti Haasan: ఆ సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న శృతిహాసన్.. ఎందుకో తెలుసా?

Shruti Haasan: ఆ సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న శృతిహాసన్.. ఎందుకో తెలుసా?

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

  Shruti Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది. శృతిహాసన్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన తండ్రి నటించిన ఈనాడు సినిమాలో కూడా ఓ పాటను పాడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది. ఇదిలా ఉంటే సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుందట శృతిహాసన్.

  అదేంటి మంచి హోదాలో ఉన్న శృతిహాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఎందుకు అనుకుంటుంది.. అని అనుకుంటున్నారా. కానీ అది ఇప్పుడు కాదు. కెరీర్ మొదట్లో తాను సినిమాలకు దూరం కావాలనుకున్న విషయాన్ని తాజాగా పంచుకుంది. నిజానికి కెరీర్ మొదట్లో ఇండస్ట్రీకి శృతిహాసన్ సింగర్ గా పరిచయమైంది. ఆ తర్వాత తన తండ్రి నటించిన సినిమాతో అడుగు పెట్టి ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా హీరోయిన్ గా మారింది.

  తనకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని.. ఆ సంగీతం మీద ఆసక్తితోనే సినిమాలోకి వచ్చానని తెలిపింది. తను చదువుకునే సమయంలో రాక్ స్టార్ అవ్వాలని అనుకుందట. సొంతంగా రాక్ బ్యాండ్ కూడా నడిపించాలని అనుకుందట. కానీ దానికి డబ్బులు కావడంతో రెండు మూడు సినిమాలలో నటించి తన డబ్బులతో బ్యాండ్ స్టార్ట్ చేసి.. సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుందట. కానీ తనకు తెలియకుండానే నటనను ఇష్ట పడటంతో ఇండస్ట్రీలోని ఉండిపోయిందట. ఇప్పుడు తనకు ఇండస్ట్రీ ప్రపంచం అని తెలిపింది.

  ఖాళీ సమయంలో మ్యూజిక్ కోసం సమయాన్ని కేటాయిస్తానని తెలిపింది శృతిహాసన్. అంతేకాకుండా త్వరలోనే ఓ మ్యూజిక్ ను కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది శృతి హాసన్.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Instagram, Kamal hassan, Krack, Shruti hassan, Social Media, Tollywood, Vakeel Saab

  ఉత్తమ కథలు