Rashmika Mandanna: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని కెరియర్లో ముందుకు సాగిపోతున్న ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా చిత్రాలు,బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించే అవకాశం రావడంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ కూడా కోట్లలోనే తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రతి సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రష్మిక ఆస్తి గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు వినబడుతున్నాయి. రష్మిక నిత్య జీవితంలో తనకు నచ్చిన దానిని కొనుగోలు చేయడానికి ఏమాత్రం సాహసించరని,ఈ క్రమంలోనే ఆమె కాస్ట్యూమ్స్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు కూడా లక్షలు పెట్టి కొంటారని తెలుస్తోంది. అదేవిధంగా రష్మికకు కార్లంటే యమ పిచ్చి ఈ క్రమంలోనే తన గ్యారేజ్ లో ఆడి క్యూ 3,రేంజ్ రోవర్ ఎస్యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే ఈమెకు అక్కడ వరుస అవకాశాలు రావడంతో ఏకంగా ముంబైలో ఒక ఫ్లాట్ కూడా కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో రష్మికకు 6-8 కోట్ల విలువ చేసే సొంత బంగ్లా ఉంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు ఈ ముద్దుగుమ్మ కోసం క్యు కట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు ఏకంగా ఈమెకు 4-5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆస్తులు సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టిన నటి రష్మిక అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గతంలో ఐటీ అధికారులు ఆమె ఇంటి పై దాడి చేశారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఐటి అధికారులు దాడి చేసింది తన ఆస్తులపై కాదని, తన తండ్రి ఆస్తులపై అని రష్మిక మేనేజర్ వివరణ ఇచ్చారు. రష్మిక తండ్రి ఒక పెద్ద బిజినెస్ మెన్ కావడంతో ఐటి అధికారులు తన తండ్రి ఆస్తుల విషయమై సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు విషయంలో నటి రష్మికకు ఎలాంటి సంబంధం లేదని... కావాలనే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రష్మిక మేనేజర్ వివరణ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Chalo film, Rashmika mandanna, Tollywood