Hero Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అభిమాన హీరోగా నిలిచాడు. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతోనే యాక్షన్ హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తన సొంత తల్లిదండ్రులు పైనే కేసు పెట్టాడు దళపతి.
విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్. ఈయన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తల్లి శోభ. ఈమె సినీ గాయని, రచయిత. ఇదిలా ఉంటే తాజాగా వీరిపై కేసు పెట్టాడు విజయ్. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. గత ఏడాది విజయ్ తండ్రి చండ్ర శేఖర్.. 'ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' అనే పేరు మీద రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక ఇందులో ఈయన జనరల్ సెక్రెటరీగా, ఈయన భార్య శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక విజయ్ తన తండ్రి పెట్టిన పార్టీ గురించి స్పందించి.. తన నాన్న పెట్టిన పార్టీకు తనకు నేరుగా, పరోక్షంగా ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. తన నాన్న పార్టీ పెట్టారని తన ఫ్యాన్స్ ఎవరిని కూడా అందులో చేరవద్దని తెలిపాడు. ఇక తన తల్లి తండ్రి పెట్టిన పార్టీ కోసం తన పేరు, తన ఫోటోలు ఉపయోగిస్తున్నారని అంతేకాకుండా ఫ్యాన్స్ క్లబ్ ను కూడా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు.
ఇవి కుడా చూడండి:మహేష్ బాబుకు బెస్ట్ యాక్టర్ అవార్డ్.. ఎంపీ చేతుల మీదుగా ప్రధానం..
దీంతో ఆయన పెట్టిన పార్టీపై తనకు ఎటువంటి సంబంధం లేదని.. పార్టీ విషయంలో తన పేరును వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. ఇక ఈరోజు తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. ఇకపై తన పేరుతో ఎటువంటి కార్యక్రమాలు, రాజకీయ మీటింగులు నిర్వహించకుండా ఉండటానికే ఈ కేసు పెట్టానని తెలిపాడు. కోర్టులో ఈ కేసు పై సెప్టెంబర్ 27న విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది.
ఇవి కుడా చూడండి:పాస్ ఫోటోలో తేజస్వి పరువాల విందు.. ఈ ఫొటోలు చూడతరమా
ఇక ఈ విషయం గురించి విజయ్ అభిమానులు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. అనవసరంగా విజయ్ ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ తనను హీరోగానే కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గతంలో కూడా విజయ్ ఫోటోను క్రికెటర్ ధోని ఫోటోను బ్యానర్ లో పెట్టి రాజకీయంగా బాగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Civil case on persons, Hero vijay, Tamil actor vijay, Thalapathy Vijay, Vijay Parents