Home /News /movies /

Dating Couple: డేటింగ్ ఒకే పెళ్లి నాట్ ఒకే అంటున్న స్టార్ కపుల్స్ వీళ్ళే.. మాములు రచ్చ కాదుగా!

Dating Couple: డేటింగ్ ఒకే పెళ్లి నాట్ ఒకే అంటున్న స్టార్ కపుల్స్ వీళ్ళే.. మాములు రచ్చ కాదుగా!

Dating Couple

Dating Couple

Dating Couple: ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సినిమా విషయంలోనే కాకుండా తమ లైఫ్ విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అలా చాలా వరకు సినిమా విషయంలో పొరపాటులు ఎదుర్కొన్నట్లు తమ జీవిత విషయంలో కూడా పొరపాట్లు ఎదుర్కొంటారు

ఇంకా చదవండి ...
    Dating Couple: ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సినిమా విషయంలోనే కాకుండా తమ లైఫ్ విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అలా చాలా వరకు సినిమా విషయంలో పొరపాటులు ఎదుర్కొన్నట్లు తమ జీవిత విషయంలో కూడా పొరపాట్లు ఎదుర్కొంటారు. ఇక పెళ్లి విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమకు నచ్చినట్లు పెళ్లి చేసుకుంటారు. నచ్చకపోతే వదిలేస్తారు. ఇక డేటింగ్ కు ఓకే అంటారు పెళ్లికి నో అంటారు. ప్రస్తుతం కొందరు జంటలు కూడా పెళ్లికి నో అంటూనే డేటింగ్ కు ఓకే అంటున్నారు.. ఎవరో తెలుసుకుందాం.

    Dating Couple
    Dating Couple


    నయనతార- విఘ్నేష్ శివన్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉంది. ఎప్పటి నుంచో వీరు కలిసి ఉండగా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ మళ్లీ ఈ విషయం గురించి ఎటువంటి స్పష్టత చేయలేకపోయారు.

    Dating Couple
    Dating Couple


    శృతిహాసన్- సంతాను హజారికా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి అందరికీ పరిచయమే. ఈ బ్యూటీ గతంలో పలువురిని ప్రేమించి బ్రేకప్ చెప్పగా ప్రస్తుతం సంతాను తో లవ్ ట్రాక్ నడిపిస్తూ డేటింగ్ లో బిజీగా ఉంది.

    దిశా పటాని- టైగర్ ష్రాఫ్: బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ హోదాలో ఉన్న దిశ పటాని, టైగర్ ష్రాఫ్ గురించి అందరికీ పరిచయమే. ఇక వీళ్ళ డేటింగ్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయం గురించి ఎవరికి తెలియదు.

    కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా తో ప్రేమలో ఉన్నట్లు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక పెళ్లి గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి మాట కూడా వినిపించలేదు.

    ఐరా ఖాన్- నుపుర్: ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పరిచయం లేని బ్యూటీ ఐరా ఖాన్. కేవలం తన తండ్రి అమీర్ ఖాన్ వల్ల సెలబ్రిటీ హోదాను అందుకుంది. ఇక ఈ బ్యూటీ తన ఫిట్నెస్ ట్రైనర్ తో లవ్ లో ఉంది. కానీ పెళ్లి విషయం గురించి తెలియదంటూ సమాధానం ఇస్తుంది.

    అవికా గోర్- మిలింద్ చద్వాని: టాలీవుడ్ ముద్దుగుమ్మ చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె మిలింద్ తో ప్రేమ లో ఉంది. అతడినే పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

    అలియా భట్- రణబీర్ కపూర్: బాలీవుడ్ లో ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంత కాలం నుండి ఈ జంట ప్రేమలో ఉండగా పెళ్లి చేసుకుంటారన్న విషయం గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

    కత్రినా కైఫ్- విక్కీ కౌశల్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కొన్ని ఏళ్ళ నుండి విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతే కాకుండా వీరి మధ్య డేటింగ్ కూడా నడుస్తున్నట్లు తెలిసింది. కాని పెళ్లి గురించి మాత్రం క్లారిటీ లేదు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Alia Bhatt, Avika ghor, Bollywood, Disha Patani, Kathrin kaif, Kiara adwani, Nayanatara vignesh, Santhanu, Shruthi hassan, Siddarth, Tiger shroff, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు