హోమ్ /వార్తలు /సినిమా /

Singer Chinmayi Sripada: వాళ్ళకి అంతా నచ్చితే ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకోమనండి.. సింగర్ చిన్మయ్ ఘాటు వ్యాఖ్యలు

Singer Chinmayi Sripada: వాళ్ళకి అంతా నచ్చితే ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకోమనండి.. సింగర్ చిన్మయ్ ఘాటు వ్యాఖ్యలు

Singer Chinmayi Sripada

Singer Chinmayi Sripada

Singer Chinmayi Sripada: టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద పరిచయం గురించి అందరికి తెలిసిందే. ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పలు సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది.

ఇంకా చదవండి ...

  Singer Chinmayi Sripada: టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద పరిచయం గురించి అందరికి తెలిసిందే. ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పలు సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది. ఇక ఈమె ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా తన పరిచయాన్ని పెంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి మంచి సమాధానం ఇచ్చింది.

  సమాజంలో జరిగే అన్యాయాలపై, అమ్మాయిలపై జరిగే దాడులపై బాగా స్పందిస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న దాడుల గురించి బాగా పోస్టులు చేస్తుంది. ఇక గతంలో కొంతమంది ప్రముఖుల అసలు రంగులు కూడా బయట పెట్టింది చిన్మయి. అలా చాలావరకు విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ వాటిని పట్టించుకోకుండా తనేంటో తనే చూసుకుంటుంది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  ఇది కూడా చదవండి:కులం, ప్రాంతం కారణంగా దారుణ అవమానాలు.. డ్రిల్ మాస్టర్‌గా పని చేశా: మోహన్ బాబు

  అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనే సెషన్ పెట్టి తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది. అందులో చాలామంది కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాల గురించి, హెల్త్ టిప్స్ ల గురించి అడిగి సలహాలు తెలుసుకున్నారు. కొందరు తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల గురించి కూడా పంచుకున్నారు. ఇక ఓ నెటిజన్ చిన్మయి ని ఒక సలహా అడిగింది.

  ఇది కూడా చదవండి:పదో తరగతిలోనే లేచిపోయా.. కానీ అతను 'యాక్సిడెంట్'లో చనిపోయాడంటూ మొదటి ప్రియుడి గురించి సిరి కన్నీళ్లు?

  తల్లిదండ్రుల కోసం ఎలాంటి త్యాగమైనా చేయొచ్చా? అది కూడా పెళ్లి విషయంలో చేయొచ్చా? అని ప్రశ్నించింది. వెంటనే చిన్మయి స్పందిస్తూ.. లేదు.. అలాంటి త్యాగాలు ఏమి చెయ్యద్దు.. అసలు చేయాల్సిన పని లేదు.. మీ జీవితాన్ని వారి కోసం త్యాగం చేయొద్దు.. మీకు నచ్చని వారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. వాళ్లకు అంత నచ్చితే.. అబ్బాయిని ఇంటికి తెచ్చుకొని పెంచమనండి.. అంటూ మంచి సమాధానం ఇచ్చింది.


  ప్రస్తుతం ఆమె ఇచ్చిన సమాధానం నెట్టింట్లో వైరల్ గా మారగా.. ఈమె సమాధానానికి చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చిన్మయి చెప్పింది నిజమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక చిన్మయి అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండగా.. తొలిసారి నటనతో చిన్మయి ఎటువంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Rahul Ravindran, Samantha Ruth Prabhu, Singer chinmayi, Tollywood

  ఉత్తమ కథలు