Vidyullekha Raman: తెలుగు సినీ నటి, కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చూడటానికి ఎంతో బొద్దుగా ఉండే ఈమె ఈమధ్య బాగా సన్నబడింది. ఇక ఈమె కెరీర్ మొదట్లో పలు నాటకాల్లో థియేటర్ ఆర్టిస్టుగా కూడా నటించింది.
Vidyullekha Raman: తెలుగు సినీ నటి, కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చూడటానికి ఎంతో బొద్దుగా ఉండే ఈమె ఈమధ్య బాగా సన్నబడింది. ఇక ఈమె కెరీర్ మొదట్లో పలు నాటకాల్లో థియేటర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. అంతేకాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేసింది. ఇదిలా ఉంటే తాజాగా తన భర్తతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది.
2012లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అదే ఏడాది నీతానే ఎన్ పోన్ వసంతం అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత రన్ రాజా రన్, సరైనోడు, రాజు గారి గది ఇలా మంచి మంచి హిట్ లను అందుకున్న సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దువ్వాడ జగన్నాథం లో మాత్రం తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.
ఇక ఈమె గత ఏడాది ఆగస్టు 26న ఫిట్ నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు తన పెళ్లి ఫోటోలను కూడా పంచుకోలేదు విద్యుల్లేఖ. కానీ ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా తన భర్త సంజయ్ తో దిగిన పెళ్లి ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తను సన్న గా మారిన ఫోటోలను కూడా పంచుకోగా అచ్చం హీరోయిన్ లా మారిందనే చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం తన భర్తతో కలిసి హనీమూన్ ట్రిప్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది విద్యుల్లేఖ. అంతేకాకుండా కొన్ని విషయాలు పంచుకుంటూ.. తనకు మాల్దీవుల ప్రదేశం అంటే ఎంతో ఇష్టమని.. తన హృదయాన్ని తాకింది అని తెలిపింది. ఇక ప్రస్తుతం తను పంచుకున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా తమ ఫోటోలను చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. ఇక ఈమె అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మరో సినిమా గల్లీ రౌడీ లో నటించింది. ఈ సినిమా కామెడీ నేపథ్యంలో తెరకెక్కనుండగా ఇందులో సందీప్ కిషన్, నేహా శెట్టి నటీనటులుగా నటించారు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.