• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SOUTH INDIAN ACTRESS KALYANI RE ENTRY IN FILMS SOON AS DIRECTOR NR

Actress Kalyani: సినిమాలను మానేసిన కళ్యాణి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Actress Kalyani: సినిమాలను మానేసిన కళ్యాణి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Actress Kalyani

Actress Kalyani: తెలుగు సినీ నటి కళ్యాణి.. ఈమె పరిచయం గురించి ఈ తరం వారికి చాలా తక్కువ తెలుసు. అప్పట్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

  • Share this:
    Actress Kalyani: తెలుగు సినీ నటి కళ్యాణి.. ఈమె గురించి ఈ తరం వారికి చాలా తక్కువ తెలుసు. అప్పట్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా చాప్టర్ 6 అనే సినిమా చేయగా.. ఆమె భర్త బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యిన కళ్యాణి తర్వాత హీరోయిన్ గా పరిచయమయింది.

    మొదట మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపై అడుగు పెట్టింది. అంతే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఆమె సూర్య కిరణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత మైదాస్ ట‌చ్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇక ఈమె నటించిన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాకు ఉత్తమ నటి నంది అవార్డు పొందింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా వసంతం సినిమాతో తన నటనకు బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ధన51 సినిమాలో అతిథి పాత్రలో కనిపించగా.. ఆ తర్వాత హీరోయిన్ గా మానేసి వదిన పాత్రలో చేసింది.

    ఇక ఈ మధ్య సినిమాలకు దూరం కాగా.. త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందట‌. అది కూడా హీరోయిన్, మరే ఇతర పాత్రలు కాకుండా ఏకంగా డైరెక్టర్ గా పరిచయం కానుందట. చేతన్ శీను అనే యువ హీరో ను తన దర్శకత్వం తో పరిచయం చేయనుందట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టానున్నారట. ఇక ఈ సినిమా గ్లిమ్స్ ను హోలీ పండుగ సందర్భంగా మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక మొత్తానికి కళ్యాణి రీ ఎంట్రీ తో డైరెక్టర్ గా పరిచయం కానుంది.
    Published by:Navya Reddy
    First published: