Nayanatara - Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నయనతార, సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరమే లేదు. ఇక ముఖ్యంగా నయనతార గురించి తెలియని వారెవ్వరూ లేరు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ తో పోటీగా దూసుకుపోతుంది. లేటు వయసులో కూడా తన అందాలను తెగ ఆరబోస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే సమంతతో కలిసి ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తుంది నయనతార.
ప్రస్తుతం నయనతార తమిళంలో తన ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'కాతువాకుల రెండు కాదల్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అంతే కాకుండా సమంత కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.. షూటింగుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
అందులో ఓ బస్సులో ఫుట్ బోర్డు లో సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రయాణం చేస్తూ కనిపించగా.. అందులో సమంత, నయనతార వైట్ కలర్ చీరలో కనిపించారు. ఇక విజయ్ సేతుపతి కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించగా.. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ వీడియో బాగా హల్ చల్ మారగా వీరి ప్రయాణం మామూలుగా లేదుగా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తొలిసారిగా ముగ్గురు స్టార్ మాటలు నటించడమే కాకుండా.. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై లలిత కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సమంత, నయనతార కాంబినేషన్ లో సినిమా ఉందనే సరికి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత తన పాత్రతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
https://twitter.com/seldicap17/status/1429684996176896001
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni samantha, Kathavukul rendu kadhal, Nayanatara, Tollywood, Vignesh Shivan