• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SOUTH INDIA STAR HEROINE NAYANTHARA DECISION ON HER MARRIAGE SHOCKS DIRECTOR VIGNESH SIVAN NR

Nayanthara: ఇలా బాగుందిగా.. ఇప్పుడే పెళ్లి ఎందుకంటూ ప్రియుడు విగ్నేష్‌కు షాక్ ఇచ్చిన నయనతార!

Nayanthara: ఇలా బాగుందిగా.. ఇప్పుడే పెళ్లి ఎందుకంటూ ప్రియుడు విగ్నేష్‌కు షాక్ ఇచ్చిన నయనతార!

Nayanatara

Nayanthara: టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నటి నయనతార. ఈమె తన నటనతో ఎంతో గుర్తింపు సొంతం చేసుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

  • Share this:
    Nayanthara: టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నటి నయనతార. ఈమె తన నటనతో ఎంతో గుర్తింపు సొంతం చేసుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా తన అందంతో అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. గతంలో విగ్నేష్ తో ప్రేమలో పడినట్లు అందరికీ తెలిసిందే.

    డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం చేస్తున్న ఈ గ్లామర్ బ్యూటీ.. ఇదివరకే ప్రభుదేవాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మరో డైరెక్టర్ శింబుతో కూడా గత కొన్ని రోజులు ప్రేమాయణం చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండగా తాజాగా విగ్నేష్ కుటుంబానికి షాక్ ఇచ్చింది నయనతార.

    ప్రస్తుతం కోవిడ్ దేశాన్ని ఎలా పట్టి పీడిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక దీన్ని నేపథ్యంలో నయనతార పెళ్లి పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట.. ప్రస్తుతం పరిస్థితులను నయనతార దృష్టిలో పెట్టుకోవడంతో ఈ ఏడాది పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గేవరకు ఆగాల్సిందని, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇక ఈ విషయాన్ని విగ్నేష్ కుటుంబంతో చెప్పిందని తెలియగా.. విగ్నేష్ కూడా అందుకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇక మొత్తానికి విగ్నేష్, నయనతార పెళ్లి వచ్చే ఏడాదిలో జరగనున్నట్లు అర్థమవుతుంది. ఇక నయనతార ప్రస్తుతం విగ్నేష్ దర్శకత్వంలో ఓ సినిమాలో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉంది.
    Published by:Navya Reddy
    First published: