కొండెక్కి కూర్చున్న నయనతార.. బహుశా ఈ అదృష్టం ఇంకెవ్వరికి రాదేమో..

బహుశా దక్షిణాదిన హీరోయిన్లు ఎవరూ అంత స్థాయి పారితోషకం అందుకుని ఉండరేమో..  ఆ రేంజ్ కు వెళ్లిందట నయనతార పారితోషకం. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా... దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న నయన పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తిదాయకమైన ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: July 20, 2019, 12:19 PM IST
కొండెక్కి కూర్చున్న నయనతార.. బహుశా ఈ అదృష్టం ఇంకెవ్వరికి రాదేమో..
నయనతార (ఫైల్ ఫోటో)
  • Share this:
బహుశా దక్షిణాదిన హీరోయిన్లు ఎవరూ అంత స్థాయి పారితోషకం అందుకుని ఉండరేమో..  ఆ రేంజ్ కు వెళ్లిందట నయనతార పారితోషకం. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా... దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న నయన పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తిదాయకమైన ప్రచారం జరుగుతోంది. ఈమె ఏ భాషైన సరే... ప్రతి సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు పారితోషకం డిమాండ్ చేస్తోందనే వార్తలు  వినిపిస్తున్నాయి.దక్షిణాదిలో నయనతార స్టార్‌ హీరోయిన్. లేడీ సూపర్‌ స్టారే అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు కనుకే ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తనకు వస్తున్న ఆఫర్లు, దక్కుతున్న విజయాలను చూసి నయనతార కొండెక్కి కూర్చుంటోదట. షూటింగ్‌ సమయంలో తనకు స్టార్‌ హోటల్స్‌లోనే బస ఏర్పాటు చేయాలనీ, ఆ స్థాయిలోనే మెను ఉండాలన్న కోరికలతో పాటు మరికొన్ని కోరికల చిట్టా తన దర్శకనిర్మాతలకు అందిస్తోందట. ఐతే డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం.. నయనతార ఈమాత్రం పారితోషకం తీసుకోవడంలో వింత ఏమీ లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అసలే నిర్మాణ వ్యయాన్ని ఎలా తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్న నిర్మాతలకు నయన కోరికల చిట్టా చూసి కళ్లు తిరుగుతున్నాయట. మొత్తానికి స్టార్‌ హీరో స్థాయిలో డిమాండ్‌ చేస్తున్న నయనతార కన్నా మరో హీరోయిన్‌ బెటరేమో అన్న ఆలోచన చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాకపోతే ఆ స్థాయిలో మరో హీరోయిన్‌ లేకపోవడం నయన అదృష్టమంటున్నారు కోలీవుడ్‌ జనాలు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 20, 2019, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading