Rashmika Mandanna: టాలీవుడ్ హీరోయిన్ కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇటీవలే మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. రోజురోజుకు మరింత హైలెట్ గా మారుతున్న రష్మిక మందన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడిపోయింది
ఇండియన్ క్రష్ గా పేరు అందుకున్న ఈ బ్యూటీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో తన పెట్ డాగ్ ఫోటోలను షేర్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో తనకు ఆనందాన్ని ఇచ్చిన తన లిటిల్ పెట్ ను అభిమానులకు పరిచయం చేస్తున్నాం అంటూ పోస్ట్ పెట్టింది. ఇక తను మూడు మిల్లీ సెకన్ లోనే తన పెట్ తో ప్రేమలో పడిందట. ప్రస్తుతం తన పెట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజనులు రక రకాలుగా స్పందిస్తున్నారు.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆడవాళ్లు మీకు జోహార్లు అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో కూడా గుడ్ బై సినిమాలో నటిస్తుంది. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక మరో సినిమా మిషన్ మజ్ను లో కూడా బిజీగా ఉంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనలు రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.