Jerusalema Song: లాక్‌డౌన్‌లో దుమ్మురేపిన సౌత్ ఆఫ్రికా సాంగ్... 23 కోట్ల వ్యూస్

Jerusalema Song: జనరల్‌గా ఏదైనా సాంగ్ చేసేటప్పుడు... అది ఓ రేంజ్‌లో హిట్టవుతుందని చాలా మంది అనుకోరు. వాళ్లు కూడా అనుకోలేదు. కానీ అది అదిరిపోయే హిట్ ఇచ్చింది.

news18-telugu
Updated: November 15, 2020, 2:58 PM IST
Jerusalema Song: లాక్‌డౌన్‌లో దుమ్మురేపిన సౌత్ ఆఫ్రికా సాంగ్... 23 కోట్ల వ్యూస్
లాక్‌డౌన్‌లో దుమ్మురేపిన సౌత్ ఆఫ్రికా సాంగ్... 23 కోట్ల వ్యూస్ (credit - youtube)
  • Share this:
Jerusalema Song in Youtube: ఒక్క సాంగ్‌కి 23 కోట్లకు పైగా వ్యూస్ రావడమంటే మాటలా... 23 కోట్ల మంది దాన్ని చూడాలి. అంత మందికి అది రీచ్ అవ్వాలి. దక్షిణాఫ్రికా సాంగ్... "జెరుసలేమా" దుమ్మురేపింది. సంగీత ప్రపంచంలో సునామీలా దూసుకుపోయింది. యూట్యూబ్‌లో సూపర్ వైరల్ హిట్టైన ఈ సాంగ్‌ను లాక్ డౌన్ హిట్ గా చెబుతున్నారు. ఇందులో జులు లిరిక్స్ ఉంటాయి. అవి వినడానికి చాలా డిఫరెంట్ ఫీల్ కలిగిస్తూ ఉంటాయి. సరిగ్గా కరోనా లాక్ డౌన్ సమయంలోనే 2019 డిసెంబర్ 12న ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజైంది. కరోనా వైరస్ కంటే వేగంగా ఇది స్ప్రెడ్ అయ్యింది. ఇందులో ఎక్కడా ఎక్స్‌స్ట్రాలు లేవు, ఓవరాక్షన్లు లేవు. స్థానిక ప్రజలంతా... ఎవరికి వచ్చినట్లు వారు డాన్సులు వేశారు. అది ప్రపంచం మొత్తానికీ నచ్చింది.

పాటలో లిరిక్స్ చూస్తే... "జెరుసలేం నా ఇల్లు. నాకు రక్షణగా ఉండండి, నాతో నడవండి, నన్ను వదిలి వెళ్లొద్దు... జెరుసలేం నా ఇల్లు... నా ప్రదేశం ఇది కాదు... నా దేశం ఇక్కడ లేదు" అని ఉంటుంది. తద్వారా... అంతర్యుద్ధాల కారణంగా... జెరుసలేం నుంచి వివిధ దేశాలకు వలస వెళ్లిపోయిన వారి ఆవేదనను ఈ పాట ద్వారా తెలిపారు. అందుకే ప్రపంచం మొత్తం ఈ పాటను చూసి, చలించింది.


ఈ పాటను సౌత్ ఆఫ్రికా మ్యుజీషియన్ గావుగెలో మొవాగీ పాడారు. ఆయన మాస్టర్ కేజీగా ప్రసిద్ధి చెందారు. మరో సింగర్ నోసెంబో జీకోడ్‌తో కలిసి... ఈ పాటను పాడారు.



ఇది కూడా చదవండి: హ్యారీ పోటర్ స్కూటర్... పెట్రోల్, ఛార్జింగ్ అక్కర్లేదు... పైసా ఖర్చు లేదు... వైరల్ వీడియో

ఇందులో యువకులు వేసిన డాన్సులు అందరికీ నచ్చాయి. చాలా మంది అవే స్టెప్స్ వేస్తూ... సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. చివరకు జెరుసలేం డాన్స్ ఛాలెంజ్ అనేది పుట్టుకొచ్చింది. చాలా మంది ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

కరోనా మెడికల్ వర్కర్లు, సైనికులు, ఇలా ఎంతో మంది ఈ సాంగ్ తో ప్రేరణ పొందారు. ఈ పాటను ఇంతలా ఆదరించినందుకు... చాలా ఆనందంగా ఉందని మాస్టర్ కేజీ తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: November 15, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading