ఈ మధ్య హీరో హీరోయిన్లంతా వారి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కొత్త సినిమా విశేషాలైనా... సినిమా కథలకు సంబంధించిన చర్చలైనా... వాళ్లింట్లో జరిగే వేడుకలైనా.. అన్నింటినీ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు ఆకతాయిలు వారి ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. సెలబ్రిటీల ఖాతాలు హ్యాక్ చేసి.. వారి ఖాతాలలో అసభ్యకరమైన పోస్టులను పెట్టడం.. లేదా డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా మరో నటి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి.
తెలుగు, తమిళ నాట సుపరిచితులైన హీరో శరత్ కుమార్. ఆయన గారాల పట్టి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. వరలక్ష్మీ ట్విట్టర్, ఇన్స్టాగ్రాం ఖాతాలు హ్యక్ అయ్యాయి.
ఇదే విషయమై ఆమె స్పందిస్తూ... ‘నా అభిమానులకు, మీడియాకు ఒక విన్నపం. గత రాత్రి నుంచి నా ట్విట్టర్, ఇన్స్టాగ్రాం ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నేను వాటిని వాడలేకపోతున్నాను. నా టెక్నికల్ టీం ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా మీకు అందుబాటులోకి వచ్చేందుకు యత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ కు చెప్పేదేమిటంటే.. నా ఖాతాల నుంచి ఏదైనా మెసేజ్ వస్తే దానికి రెస్పాండ్ కావొద్దు. నా ఖాతాలను నా అధీనంలోకి రాగానే నేనే స్వయంగా మీకు తెలియజేస్తున్నాను. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను...’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hacking, Social Media, Tamil Film News, Tollywood, Varalaxmi Sarathkumar