Actress Sneha: వామ్మో.. స్నేహ అందాల విందు.. ఈ వయసులోనూ హాట్ హాట్ వర్కవుట్స్

Actress Sneha

Actress Sneha: ఒకప్పటి తెలుగు సినీ నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

  • Share this:
    Actress Sneha: ఒకప్పటి తెలుగు సినీ నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఈమె ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన కొన్ని సంవత్సరాల కిందటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ఆమె ఎనర్జీ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.

    తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ.. ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈమె తన భర్త, సినీ నటుడు ప్రసన్న తో గతంలో ఓ సినిమాలో నటించగా ఆ సమయంలో వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని బాగా వార్తలు వినిపించాయి.

    ఇది కూడా చదవండి:ఒకే రోజు కొత్త కార్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీలు దేవి నాగవల్లి, అరియనా.. కార్ల ధర ఎంతంటే?

    స్నేహ ఎక్కడికి వెళ్ళినా అక్కడే ప్రసన్న కూడా కనిపించడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందని అనుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరు మీడియా ముందు తమ ప్రేమ గురించి ప్రేక్షకులకు తెలిపారు. ఆ తర్వాత ఏడాది 2012లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ ప్రసన్న కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే స్నేహ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు స్నేహ తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

    ఇది కూడా చదవండి:అర్ధరాత్రి బాత్రూమ్‌లో లహరీ నువ్వు కౌగిలించుకోలేదా రవి.. ప్రియా ఆంటీ డర్టీ టాక్.. నెటిజన్స్ ట్రోల్

    ఇక ఇప్పటికీ కూడా తన అందం మాత్రం ఇంకా చెదరలేదు అని చెప్పాలి. ఈ వయసులో కూడా స్నేహ తెలుగు హీరోయిన్ లాగా కనిపిస్తుంది. ఇప్పటికీ స్నేహ, ప్రసన్న జంట ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గానే ఉంది. ఇక వీరిద్దరూ కలిసి బుల్లితెర ప్రకటనల్లో కూడా చేశారు. ఈమె వర్క్ అవుట్ లు కూడా బాగా చేస్తుంటుంది. అందుకే తాను ఇప్పటికీ ఇలాగే ఉందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే కొన్ని సంవత్సరాల కిందట తాను చేసిన జిమ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అందులో తను వర్క్ అవుట్ లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందులో ఆమె ఎనర్జీని చూసి తన అభిమానులు.. వామ్మో అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: