Sai Pallavi: ఆరోజు రాత్రి షూటింగ్.. వచ్చి నా చెయ్యి పట్టుకున్నారంటూ సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్?

Sai Pallavi

Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హైబ్రిడ్ పిల్లగా ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ సినిమాతో సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

  • Share this:
    Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హైబ్రిడ్ పిల్లగా ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ సినిమాతో సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఎంతో హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే రాత్రిపూట షూటింగ్ లో తనతో అలా ప్రవర్తించారని తెలిపింది.

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇందులో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా కోవిడ్ కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాకు రేపు ముహూర్తం కుదిరింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ లు, ట్రైలర్ లు, టీజర్లు, సాంగ్స్ అన్ని విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో తాజాగా ప్రమోషన్ లో భాగంగా ఈ సినీ బృందం మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది.

    ఇది కూడా చదవండి:సాయి పల్లవి నా సినిమా రిజెక్ట్ చేసింది.. కానీ అది మంచిదే: మెగాస్టార్ చిరంజీవి

    సాయి పల్లవి కూడా కొన్ని విషయాలు పంచుకోగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో పనిచేయడం చాలా అదృష్టం అని తెలిపింది. అంతే కాకుండా కొన్ని మార్పులు కూడా వచ్చాయని తెలిపింది. తాను ఇప్పుడు మరింత సున్నితంగా ఉంటున్నానని, సాధారణంగానే ఉంటున్నానని అంతే కాకుండా నేల మీదే కూర్చొని పని చేస్తానని తెలిపింది. దీంతో తనకు సాధారణ జీవితం అలవాటని తెలిపింది. ఇక ఈ సినిమా ఎక్కువగా రూరల్ ఏరియా లో జరిగింది అంటూ ఎక్కువగా బయటికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది.

    ఇది కూడా చదవండి:ఎట్టకేలకు చైతూ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
     తను తెలుగు అమ్మాయి లాగానే ఫీల్ అవుతానని.. ఫిదా సినిమా కోసం బాన్సువాడ, ఈ సినిమా కోసం ఆర్మూర్ కు వెళ్లాల్సి వచ్చిందని.. అక్కడి ప్రజలంతా తమ అందర్నీ నటీనటులు అనే తేడా లేకుండా బాగా మాట్లాడారని చెప్పుకొచ్చింది. కరోనా సమయంలో రాత్రిపూట షూటింగ్ జరిగినా కూడా విసుగు చెందలేదని.. అంతేకాకుండా వాళ్లంతా దగ్గర కూర్చొని చెయ్యి పట్టుకొని మాట్లాడారని తనతో చాలా విషయాలు పంచుకున్నారని ఆ ఊరి ప్రజల గురించి గొప్పగా మాట్లాడింది. ఇక బాన్సువాడలో ఓ డిజైనర్ తనకు ఒక చీరను కానుకగా ఇచ్చిందని.. అందుకే గ్రామాలలోకి వెళితే అక్కడే ఉండాలి అనిపిస్తుందని తెలిపింది సాయిపల్లవి.
    Published by:Navya Reddy
    First published: