సౌత్ సినిమాలతో ఫిల్మ్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన(Rashmika Mandana) ఇప్పుడు నార్త్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రష్మిక మందన పుష్ప(Pushpa),గీత గోవిందం(Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. గతంలో తెలుగు(Telugu),(Malayalam), తమిళ (Tamil), మలయాళ (Malayalam)సినిమాల్లో మాత్రమే పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన ఇప్పుడు ముంబై(Mumbai)లో హల్‌చల్ చేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్(Bollywood star producer)కరణ్‌జోహార్(Karan Johar)బర్త్ డే పార్టీలో బాలీవుడ్ హీరోయిన్స్ కంటే రష్మిక మందన ఇచ్చిన ఎంట్రీనే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిగ్‌గా మారింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూసి సినిమా అభిమానులతో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు.
రష్మిక రచ్చ మాములుగా లేదు..
హీరోయిన్‌కి స్టార్ డమ్ రావాలలే ఆఫర్లు వెంట వెంటనే వరుసబెట్టుకొని వస్తుంటాయి. రష్మిక మందన విషయంలో కూడా అదే ఫార్ములా వర్కవుట్ అవుతోంది. ఇటు సౌత్‌లో..అటు నార్త్‌లో కూడా చేతి నిండా సినిమాలో తెగ బిజీ యాక్టరస్‌గా మారిపోయింది. ప్యాన్ ఇండియా సినిమా సక్సెస్ కావడంతో రష్మిక మందనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. సౌత్‌లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి వెళ్లిన అమ్మడు ఫుల్ బ్లాక్ స్కిట్ ఫిట్ డ్రెస్‌తో సింగిల్ షోల్డర్, సింగిల్ లెగ్స్ కనిపిస్తూ ఉండే డ్రెస్ వేసుకొని వెళ్లడంతో అందరి కళ్లు రష్మికపైనే పడ్డాయి.
View this post on Instagram
అందరి కళ్లు ఆమెపైనే..
ఒక్కమాటలో చెప్పాలంటే కరణ్‌జోహార్ 50వ పుట్టిన రోజు వేడుకలకు ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తెలు అటెండ్ అయినప్పటికి రష్మిక మందన ఎంట్రీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే అమ్మడు వేసుకున్న డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్నప్పటికి..డ్రెస్ సరిచేసుకోలేక తెగ ఇబ్బంది పడిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక డ్రెస్ సరిచేసుకుంటున్న వీడియోనే తెగ వైరల్ అవుతోంది.
ముంబైలో మందన హల్‌చల్..
కిర్రాక్ పార్టీ సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే గ్లామరస్ పాత్రలు చేసి మంచి హీరోయిన్‌గా పేరు సంపాధించుకుంది. టాలీవుడ్‌లో బిగ్ స్టార్స్ మహేష్‌బాబు, అల్లుఅర్జున్, విజయ్‌దేవరకొండ పక్కన జోడి కట్టిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ యంగ్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అందుకే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే అటెండ్ అయిన కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి రష్మిక మందన ఒక్కరే అటెండ్ అయి..హల్‌చల్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ మాత్రం రష్మికా గ్లామర్‌కి సౌత్ ఏంటీ ..నార్త్ ఏంటీ ఎక్కడైనా తగ్గేదేలే అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.