Actress Pranitha Subhash: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రణీత. తెలుగు సినిమాలలో మంచి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఎటువంటి గాసిప్ లకు లొంగిపోని బ్యూటీ తాజాగా రహస్యంగా పెళ్లి చేసుకొని బాగా వైరల్ గా మారింది. అంతేకాకుండా తన భర్త గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది.
బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ప్రణీత. సాంప్రదాయ ప్రకారం అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో బెంగళూరులో ప్రణీత ఇంట్లోనే పెళ్లి జరిగింది. గత ఆదివారం జరిగిన ఈ పెళ్లి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ పెళ్లి విషయం గురించి ప్రణీత ఎవరికి చెప్పకపోగా ఈ పెళ్లి కి వెళ్లిన తమ స్నేహితుడు తమ పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు.
ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన ప్రణీత తమది ప్రేమ పెళ్ళని తెలిపింది. తన భర్త తనకు చాలా కాలంగా తెలుసని ఇక తమ విషయాన్ని ఇంట్లో చెప్పగానే పెళ్లికి ఒప్పుకున్నారని తెలిపింది. తన వ్యక్తిగత విషయాలను తనకు బయటపెట్టడం ఇష్టముండదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పరిస్థితులను బట్టి పెళ్లికి ఎవరిని పిలవలేదని వివరించింది. ఇక తన భర్త బెంగళూరులో వ్యాపారవేత్త అని హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఉన్నత విద్యను అభ్యసించడానికి తెలిపింది.
అతను బ్లూ హరిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2011లో ప్రారంభించారని, ఇక ఈ సంస్థకు డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. హంగామా 2, భుజ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక కన్నడంలో మరో సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attarintiki Daredi, Kannada actress, Nitin Raju, Pranitha subhash