సినిమా హీరోయిన్‌లు పిల్లల్ని కంటున్నారు. కాని వాళ్లును మీడియాకు చూపించడం లేదు. ఎవరి కంటపడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సౌత్ యాక్టరస్ నయనతార(Nayantara), డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh sivan)దంపతులు కూడా ఇదే తంతుక కొనసాగించారు. రీసెంట్‌గా కవల పిల్లలకు పేరెంట్స్ అయ్యారు ఈ స్టార్ కపుల్. ఇప్పటి వరకూ ఆ చంటి పిల్లలు ఎలా ఉంటారో చూపించిని నయనతార, విఘ్నేష్ శివన్..షడన్‌గా ఇద్దరు పిల్లల్ని చెరొకరు ఎత్తుకొని కారులోంచి ముంబై (Mumbai)ఎయిర్‌పోర్టు(Airport)లో కనిపించారు. అంతే అక్కడున్న మీడియా వాళ్లు ఫోటోలు తీసుకున్నారు. వీడియోలు తీశారు. నయనతారను పిల్లల్ని చూపించమని కోరితే చూపించకుండానే ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వెళ్లిపోయారు.
పిల్లల్ని చూపించని స్టార్ జోడి ..
సౌత్ బ్యూటీ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల్ని ఎత్తుకొని ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. నయన్ బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకోగా..ఇద్దరు పిల్లలకు రెడ్ అండ్ బ్లాక్ కలర్‌లో ఉన్న సేమ్ డ్రెస్‌లను వేశారు. ఇద్దరూ చేరో బాబును ఎత్తుకొని ఎయిర్‌పోర్ట్‌లోకి ఫ్లైట్ ఎక్కడానికి వచ్చారు. రీసెంట్‌గా ముంబైలో జవాన్ షూటింగ్ కోసం వచ్చిన నయనతార..తన షెడ్యూల్ మిగియగానే తిరిగి చెన్నైకు తిరుగు ప్రయాణమైంది. అందులో భాగంగానే ముంబై ఎయిర్‌పోర్టుకు ఫ్లైట్ ఎక్కడానికి వచ్చిన ఈవిధంగా మీడియా కెమెరాలకు చిక్కారు.
View this post on Instagram
నయనతార ట్విన్స్ వీళ్లే..
అక్కడున్న మీడియా వారికి, అభిమానులు పలకరిస్తే విమానాశ్రయంలోకి అడుగుపెడుతూనే నయనతార, విఘ్నేష్‌లు నవ్వుతూ చేతులు ఊపారు. అయితే తమ పిల్లలు ఉయిర్, ఉలగం కనిపించకుండా గుండెలకు హత్తుకున్నారు.
వైరల్ అవుతున్న వీడియో..
డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించిన నయనతార.. గతేడాది జూన్ 9వ తేదిన ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలో జరిగిన వీరి వెడ్డింగ్‌కి అతి తక్కువ మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్, AR రెహమాన్, కోలీవుడ్ నుంచి రజనీకాంత్ , సూర్యతో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించిన సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి జరిగిన నెలల వ్యవధిలోనే వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ బిడ్డలను ఆశీర్వదించమని పాదాలను ముద్దాడుతున్న ఫోటోలను ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.