హీరోయిన్ హన్సికా మోత్వాని(Hansika Motwani)పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ముంబై(Mumbai)కి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథారియా(Sohail Katharia)ను ప్రేమించిన దేశముదురు హీరోయిన్ హన్సిక జైపూర్(Jaipur)లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. రెడ్ కలర్ వర్క్ లెహెంగాలో హన్సికా,సిల్వర్, వైట్ కలర్ షెర్వానీలో సోహైల్ కలర్ఫుల్గా తయారయ్యారు. టాలీవుడ్(Tollywood)హీరోయిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో(Video)లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్(Viral) అవుతున్నాయి.
గ్రాండ్‌గా హన్సికా పెళ్లి ..
జైపూర్‌లోని 400ఏళ్ల క్రితం నిర్మించిన రాజకోటలో ముంబై లేడీ హన్సికా మోత్వానీ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ముందుగా గులాబీలతో అలంకరించిన పల్లకిపై పెళ్లికూతురు అలంకారంలో వివాహ వేదికకు వచ్చిన హన్సిక మెడలో పూల దండ చేసి నుదుటన బొట్టు పెట్టి తన భార్యను చేసుకున్నాడు సోబైల్ కథారియా. అటుపై వివాహ వేదిక చుట్టూ అమర్చిన క్రాకర్స్ వెలుగుల్లో నూతన దంపతులు చిరునవ్వులు చిందించారు.
View this post on Instagram
సంగీత్ వీడియో వైరల్ ..
కొత్తగా పెళ్లి చేసుకున్న హన్సిక, సోహైల్ కపుల్స్‌ని పల్లకిపై ఊరేగిస్తూ డ్యాన్స్‌లు చేశారు కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు. హన్సిక పెళ్లి వేడుకలు గత పది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు హన్సికా పెళ్లి ముగిసే వరకూ రోజుకో పండుగలా జరుపుకుంది. చివరగా వెడ్డింగ్ ముందు రోజు ఏర్పాటు చేసిన సంగీత్‌లో హన్సికా, సోహైల్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
తమ్ముడి పెళ్లి కంటే గ్రాండ్‌గా..
బాలీవుడ్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన హన్సికా మోత్వానీ..ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా స్టార్ హీరోల పక్కన నటించింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పటికి పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు హన్సికా పెళ్లి చేసుకున్న రాజకోటలోనే తన సోదరుడు ప్రశాంత్ మోత్వాని వివాహం ఏడాది క్రితం జరిగింది. అంతకంటే గ్రాండ్‌గా హన్సికా మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hansika motwani, Tollywood actress