Sameera Reddy: నువ్వు మాత్రమే ఎందుకు ఇలా ఉన్నావ్.. నెటిజెన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమీరారెడ్డి

Sameera Reddy

Sameera Reddy: తెలుగు సినీ నటి సమీరా రెడ్డి గురించి అందరికీ పరిచయమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో జై చిరంజీవ సినిమాతో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Sameera Reddy: తెలుగు సినీ నటి సమీరా రెడ్డి గురించి అందరికీ పరిచయమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో జై చిరంజీవ సినిమాతో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఇక పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకే దూరమైంది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది సమీరా.

    2002లో హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక 2005లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, హిందీ తో పాటు బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది. తెలుగు ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు అందుకోలేకున్నా కూడా ఇతర భాషలలోనూ అవకాశాలు అందుకొని మంచి పేరు సంపాదించుకుంది.

    ఇది కూడా చదవండి:వాళ్ళకి అంతా నచ్చితే ఆ అబ్బాయిని దత్తత తెచ్చుకోమనండి.. సింగర్ చిన్మయ్ ఘాటు వ్యాఖ్యలు

    ఇక 2014 లో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ్ వార్దేని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీ ఫోటోలను తన ఫాలోవర్స్ తో బాగా షేర్ చేసుకుంటుంది.

    ఇది కూడా చదవండి:కులం, ప్రాంతం కారణంగా దారుణ అవమానాలు.. డ్రిల్ మాస్టర్‌గా పని చేశా: మోహన్ బాబు

    ఇక ఈమె చాలా వరకు మేకప్ వేసుకోవడం ఇష్టపడదు. నిజానికి ఈమె వయసులో ఉన్న చాలామంది హీరోయిన్స్ ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. కారణం నిత్యం మేకప్ లాంటివి వేసుకొని తమ వయసుని బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ సమీరా రెడ్డి మాత్రం తన వయసుని అసలు దాచుకోదు. ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకుంది. అందులో తన జుట్టు తెల్లగా ఉండటంతో ఓ నెటిజన్ ఆమెను నేరుగా ఓ ప్రశ్న అడిగేసాడు.






    మీకు 42 ఏళ్ళు ఉన్నాయ్ అనుకుంటా.. బాలీవుడ్ లో మీ వయసు ఉన్న హీరోయిన్ ల జుట్టు మాత్రం నల్లగా ఉంది.. మీది మాత్రం ఎందుకు ఇంత త్వరగా తెల్లగా మారింది అని అడిగాడు. ఇక ఈ ప్రశ్నకు సమీరా రెడ్డి స్పందిస్తూ.. వీటిపై నేను నోరు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నాను.. అప్పుడు ఇలాంటి వాటిలో మార్పులు వస్తాయి అని.. ఎంతో మంది ఆడవాళ్లు వాటిని కవర్ చేస్తారు.. కొందరు కవర్ చెయ్యరు.. ఎవరి ఇష్టం వారిది అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
    Published by:Navya Reddy
    First published: