Cinema Theatres: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవడానికి ఒప్పుకోని నిర్మాతలు..?

సినిమా థియేటర్స్ (cinema theatres)

Cinema Theatres: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే చెప్పినంత మాత్రానా పండగ చేసుకోవాలని లేదు. ఎందుకంటే అక్కడ చాలా సమస్యలు కనిపిస్తున్నాయి.

  • Share this:
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే చెప్పినంత మాత్రానా పండగ చేసుకోవాలని లేదు. ఎందుకంటే అక్కడ చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. కేవలం థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని మాత్రమే కాదు.. అందులో మెలిక కూడా బాగానే పెట్టింది కేంద్రం. కేవలం 50 శాతం మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉండేలా చూసుకోవాలని చెప్పింది. ఇదే నిర్మాతలకు తిప్పలు తీసుకొస్తుంది. కేంద్రం చెప్పినట్లు థియేటర్స్ ఓపెన్ చేసుకుంటే నిజంగానే అప్పుల పాలైపోతామని చెప్తున్నారు నిర్మాతలు. కనీసం థియేటర్ రెంట్లు.. కరెంట్ బిల్లు కూడా కట్టుకోలేని స్టేజీకి దిగజారిపోతామంటున్నారు. అందుకే ఇప్పట్లో మేం థియేటర్స్ తెరవాలనుకోవట్లేదు అంటూ తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడులో నవంబర్ 1 వరకు కూడా థియేటర్స్ ఓపెన్ చేసేది లేదని తెలిపారు. ఇప్పుడు తెలుగులో కూడా ఇదే చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఎందుకంటే ఇక్కడ కొన్ని అనుమానాలు అందర్నీ వేధిస్తున్నాయి.

టాలీవుడ్ నిర్మాతలు (Tollywood producers)
టాలీవుడ్ నిర్మాతలు (Tollywood producers)


అక్టోబర్ 15న కేంద్రం చెప్పినట్లు థియేటర్స్ ఓపెన్ చేస్తే ఆడియన్స్ ముందులా వస్తారా అనేది అతిపెద్ద అనుమానం. సరే.. దేనికైనా ఓ చోట మొదలు అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసారే అనుకుందాం.. రానురాను అదే సర్దుకుంటుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. వాళ్ల నమ్మకమే నిజమై ఒకవేళ వచ్చారే అనుకుందాం.. కేవలం సగం టికెట్స్ మాత్రమే అమ్ముకోవాలి అనేది వర్కవుట్ అవుతుందా అనేది మరో పెద్ద డౌట్. తొలిరోజే పైరసీ వచ్చేస్తున్న ఈ రోజుల్లో.. 50 శాతం టికెట్స్ అమ్ముకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బయట పడతారా అనే మిలియన్ డాలర్ ప్రశ్న.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


అలా కాదని టికెట్ రేట్స్ పెంచేస్తే ఆడియన్స్ చూడ్డానికి వస్తారా..? అసలే ఆర్నెళ్లుగా కరోనా కరువుతో అల్లాడిపోతున్న జనం.. సినిమా టికెట్స్ రేట్ పెంచితే చూడ్డానికి వస్తారా.. లేదంటే అసలుకే మోసం వస్తుందా అనేది తెలియక తల పట్టుకున్నారు నిర్మాతలు. మరోవైపు ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి. వాళ్లు కూడా చాలా సినిమాలు విడుదల చేస్తున్నారు. నిర్మాతలు థియేటర్స్ అయితే రిస్క్ అని.. వచ్చిన వరకు చాలు అనుకుని సేఫ్‌గా బయట పడటానికి ఓటిటిని నమ్ముకుంటున్నారు.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


అలా కాదని థియేటర్‌లో సగం టికెట్స్‌కు ఒప్పుకుని ధైర్యం చేసి విడుదల చేసినా 40 కోట్లు వసూలు చేసే సినిమా 20 కోట్లు కూడా రాదు.. మరి అంత సాహసం ఏ నిర్మాత చేస్తాడు..? అలా మొదట విడుదల చేసే సినిమా కచ్చితంగా ప్రయోగమే అవుతుంది. 50 శాతం టికెట్స్ పక్కన బెట్టేద్దాం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు థియేటర్స్ అనేది సేఫేనా..? పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమా థియేటర్స్‌లో చూడాలనుకుంటాం.. కానీ 50 శాతం టికెట్స్ అమ్మాలంటే మరి మిగిలిన అమౌంట్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టం కాదా..?

థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)


మరి మిగిలిన అమౌంట్ కేంద్రం భరిస్తుందా.. అంటే అదీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవడి చావు వాడే చావాలి. సినిమా చూడ్డానికి వచ్చినోడే ఎన్ని డబ్బులైనా కట్టుకోవాలి. కేంద్రం చెప్పినట్లు చేస్తే 50 శాతం టికెట్స్‌తో వాళ్ల రెంట్లు కూడా రావు. పెద్ద సినిమాలనే పట్టించుకుంటారా లేదా.. కలెక్షన్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఉంటే.. చిన్న సినిమాలను పట్టించుకునే దిక్కు దివానం కూడా ఉండదు.. మరి వాటి సంగతేంటి..? ఇవే కాదు.. ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


ఇలాంటి సమయంలో థియేటర్స్ రీ ఓపెన్ చేసినా అసలు లాభం ఉంటుందంటారా..? ఏమో మరి అన్నీ కాలమే నిర్ణయిస్తుందేమో..? ఏదేమైనా థియేటర్స్ ఓపెన్ చేస్తే సినిమా చూడాలని సగటు సినీ ప్రేక్షకుడికి కూడా చాలా ఆశగా ఉంది.. చూద్దాం ఏం జరుగుతుందో..? అందుకే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేయొద్దనే నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో పరిస్ధితులు చూసి నవంబర్ 1 తర్వాతే నిర్ణయించుకోవాలని ఇక్కడ అంతా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: