దేశంలో ప్రస్తుతం కరోనా విళయ తాండవం చేస్తుంది. చిన్నా పెద్దా ముసలి ముతకా అనే తేడా లేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా అటాక్ చేస్తూనే ఉంది ఈ వైరస్. తాజాగా టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. నిర్మాతగా అవతారం ఎత్తిన ఈయనకు ఇప్పుడు కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, శంషాబాద్ సహా బండ్ల గణేష్ ఉండే షాద్‌నగర్ వైపు కూడా కరోనా కేసులు బాగానే వస్తున్నాయి.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈయనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు రావడంతో ప్రస్తుతం అంతా కంగారు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా సైలెంటుగా టెస్టులు చేయించుకుంటున్నట్లు సోషల్ మీడియాలోవార్తలు అయితే వస్తున్నాయి. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన గణేష్‌ను అక్కడ ముందుగా కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు. తీరా చేసిన తర్వాత ఈయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై సీనియర్ న్యూస్ 18 ప్రతినిథి ఒకరు ఈ నిర్మాతతో ఫోన్లో సంప్రదించగా.. అలాంటిదేం లేదని.. తాను బాగానే ఉన్నానని.. కావాలంటే మీడియా ముందుకు కూడా వస్తానని చెప్తున్నాడు. మొత్తానికి గణేష్ కరోనా విషయంలో కన్ఫ్యూజన్ సాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Telugu Cinema, Tollywood